జాన్వీ కపూర్‌ ప్రియుడు అతనేనా? మరోసారి బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అవుతున్న ఫోటో.. లవ్‌ ఎఫైర్స్ వైరల్‌

Published : Oct 26, 2022, 02:37 PM ISTUpdated : Oct 26, 2022, 02:39 PM IST

స్టార్‌ కిడ్‌ జాన్వీ కపూర్‌ హాట్‌ ఫోటోలతో సెన్సేషనల్‌గా మారుతుంది. కానీ ఇప్పుడు ఆమె డేటింగ్‌ రూమర్స్ తో హాట్‌ టాపిక్‌గా మారింది. తన బాయ్‌ ఫ్రెండ్‌తో దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో రచ్చ లేపుతుంది. 

PREV
17
జాన్వీ కపూర్‌ ప్రియుడు అతనేనా? మరోసారి బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అవుతున్న ఫోటో.. లవ్‌ ఎఫైర్స్ వైరల్‌

జాన్వీ కపూర్‌(janhvi Kapoor) బోల్డ్ ఫోటో షూట్లతో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంటుంది. తరచూ ఆమె గ్లామర్‌ ఫోటోలు ఇంటర్నెట్‌లో బ్లాస్ట్ అవుతుంటాయి. జాన్వీ ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుందంటే ఇక ఆ రోజు అభిమానులకు పండగే. వారానికి సరిపదే ఫీడ్ దొరికినట్టుగానే భావిస్తుంటారు నెటిజన్లు. 

27

తన బోల్డ్, సెక్సీ అందాలను ఆవిష్కరించేలా ఉన్న ఫోటో షూట్లకి లక్షలాది మంది అభిమానులున్నారు. వారిని ఏ రోజూ డిజప్పాయింట్‌ చేయదు జాన్వీ. వారికి కావాల్సింది ఇస్తూ, తనకు కావాల్సింది తీసుకుంటుంది. అందుకే ఈ బ్యూటీ ఇంటర్నెట్‌ సెన్సేషన్‌గా నిలుస్తుంది. తాజాగా మరో రూపంలో సంచలనంగా మారింది. 
 

37

జాన్వీ కపూర్‌ పై ఇప్పుడు డేటింగ్‌ రూమర్స్ ఊపందుకున్నాయి. గతంలో ఓ సారి ఇలాంటి గాసిప్పులు వచ్చాయి, కానీ అవి అంతలోనే మాయమైపోయాయి. కానీ ఇప్పుడు మరోసారి ఆమె లవ్‌ ఎఫైర్‌ రూమర్స్ తెరపైకి రావడం ఆశ్చర్యపరుస్తుంది. అందుకు దీపావళి వేడుక వేదిక కావడం విశేషం. 

47

తాజాగా జాన్వీ మంగళవారం సాయంత్రం తన లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు షేర్ చేసింది. దీపావళి బాష్‌ సందర్భంగా చేసుకున్న పార్టీలో దిగిన ఫోటోలు ఇవి. జాన్వీ కపూర్‌ ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్నారు. వీరితోపాటు జాన్వీ నటిస్తున్న `మిలి` మూవీ యూనిట్‌ కూడా పంచుకుంది.  
 

57

వీరిలో ప్రధానంగా బోనీ కపూర్‌, అనిల్‌ కపూర్‌, అర్జున్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌, అలాగే గ్రాండ్‌ మదర్‌ నిర్మల్‌ కపూర్‌, సంజయ్‌ కపూర్‌, అమృత్‌పాల్‌ సింగ్‌, సారా అలీ ఖాన్‌, న్యైసా దేవగన్‌, అమిద్‌ వంటి వారు పాల్గొన్నారు. వీరితోపాటు సోషల్‌ యాక్టివిస్ట్, యానిమేషన్‌ మేకర్‌ ఒర్హన్‌ అవత్రమణి కూడా ఉండటం విశేషం. గతంలో జాన్వీ, ఒర్హాన్‌పై డేటింగ్‌ రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. 
 

67

తాజాగా జాన్వీ, ఒర్హాన్‌ కలిసి దీపావళి పార్టీలో పోజులిచ్చారు. జాన్వీ ఫ్యామిలీ పార్టీలో అతను పాల్గొనడం, పైగా ఈ ఇద్దరు కలిసి సంతోషంగా పోజులివ్వడం ఇప్పుడు ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఇద్దరి మధ్య లవ్‌ ఎఫైర్‌ రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. బాలీవుడ్‌లో ఇవి కోడై కూస్తున్నాయి. నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. మరి వీరి డేటింగ్‌ రూమర్స్ లో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 
 

77


జాన్వీ కపూర్‌ ప్రస్తుతం `మిలి` చిత్రంలో నటించింది. ఈ సినిమా నవంబర్‌ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉంది జాన్వీ. అందులో భాగంగా తన హాట్‌ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని కనువిందు చేస్తుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ హాట్‌ ట్రీట్‌తో మెస్మరైజ్‌ చేస్తూ హాట్‌ టాపిక్‌గా మారింది.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories