సల్మాన్‌కి వెరైటీగా బర్త్ డే విషెస్‌ తెలిపిన `సాహో` హీరోయిన్‌ జాక్వెలిన్‌.. ఫోటో వైరల్‌

Published : Dec 28, 2020, 09:25 AM IST

తన `కిక్‌` స్టార్‌, బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కి వెరైటీగా బర్త్ డే విషెస్‌ తెలిపింది శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌. సర్‌ప్రైజ్‌తోపాటు షాక్‌ గురిచేసేలా ఓ ఫోటోని తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది జాక్వెలిన్‌. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌ అవుతుంది. అంతేకాదు `బిగ్‌బాస్‌` హౌజ్‌లోనూ సందడి చేసిందీ బ్యూటీ.    

PREV
112
సల్మాన్‌కి వెరైటీగా బర్త్ డే విషెస్‌ తెలిపిన `సాహో` హీరోయిన్‌ జాక్వెలిన్‌.. ఫోటో వైరల్‌
సల్మాన్‌ ఖాన్‌ తన బర్త్ డే వేడుకలకు దూరంగా ఉన్నారు. కరోనా నేపథ్యంలో అభిమానులెవరినీ రావద్దు అని తెలిపారు. ప్రస్తుతం ఆయన హిందీ వెర్షన్‌ `బిగ్‌బాస్‌` 14 సీజన్‌ని హోస్ట్ చేస్తున్నారు.

212
బిగ్‌బాస్‌ హౌజ్‌లోనే బర్త్‌ డే వేడుకలు నిర్వహించారు. హౌజ్‌లో గెస్ట్ లుగా విచ్చేసిన జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, సీనియర్‌ నటి రవీనా టండన్‌ మెరిశారు. దగ్గరుండి సల్లూభాయ్‌ పుట్టిన రోజులు నిర్వహించారు. ఆయన చేత కేక్‌ కట్‌ చేయించారు. ఈ సందర్భంగా సల్మాన్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

312
సల్మాన్‌, జాక్వెలిన్‌, రవీనా టండన్‌ ఒకనొకరు కేక్‌ తినిపించుకున్నారు.

412
అంతటితో ఆగలేదు. సల్మాన్‌తో కలిసి జాక్వెలిన్‌, రవీనా టండన్‌ హౌజ్‌లో స్టెప్పులేశారు. ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

512
అయితే జాక్వెలిన్‌ ఇన్‌స్టా ద్వారా సల్మాన్‌కి బర్త్‌ డే విషెస్‌ తెలిపిన విధానం ఆకట్టుకుంటోంది. ఇందులో ఆమె `కిక్` సినిమా టైమ్‌లోని ప్రెస్‌మీట్‌లో సల్మాన్‌తో ఉన్న ఫోటోని పంచుకుంటూ అందులో ఇద్దరి ఫేస్‌లను చిన్న పిల్లలుగా మార్ఫింగ్‌ చేసింది.

612
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అభిమానులు సరదా కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. దీన్ని ఎంజాయ్‌ చేస్తుంది జాక్వెలిన్‌.

712
సల్మాన్‌, జాక్వెలిన్‌ కలిసి మొదటగా `కిక్‌` చిత్రంలో నటించారు. అప్పటి వరకు అడపాదడపా సినిమాలు చేస్తున్న జాక్వెలిన్‌కి మంచి పాపులారిటీని తీసుకొచ్చిందీ చిత్రం. హిందీలో భారీ విజయం సాధించింది. ఇందులో సల్మాన్‌, జాక్వెలిన్‌ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది.

812
ఆ తర్వాత రెండేళ్ల క్రితం మరోసారి జోడీ కట్టారు. `రేస్‌3`లో ఇద్దరు కలిసి మరోసారి రొమాన్స్‌ చేశారు. ఈ సినిమా పరాజయం చెందింది.

912
1012
అంతేకాదు సల్మాన్‌కి నిత్యం టచ్‌లోనే ఉంటుంది జాక్వెలిన్‌. ఇటీవల లాక్‌డౌన్‌ టైమ్‌లో వీరిద్దరు కలిసి `తేరే బిన్‌` అంటూ ఓ స్పెషల్‌ వీడియో సాంగ్‌ చేశారు.

1112
దీన్ని విడుదల చేయగా, సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. సల్మాన్‌, జాక్వెలిన్‌ స్క్రీన్‌పై మెస్మరైజ్‌ చేశారని చెప్పొచ్చు.

1212
మరోవైపు జాక్వెలిన్‌ క్రిస్మస్‌ వేడుకలో పాల్గొంది. వైట్‌ డ్రెస్‌ విత్‌ బ్లాక్‌ డాట్స్ తో కూడిన డ్రెస్‌ ధరించి ఆకట్టుకుంది. క్రిస్మస్‌ ట్రీ వద్ద కాసేపు హోయలు పోయింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories