Janhvi Kapoor : తెలుగులో జాన్వీ కపూర్ మరో సినిమా? ఏ హీరో సరసన అంటే..

First Published | May 11, 2023, 8:09 PM IST

యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తెలుగులో రెండో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. 
 

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేసుకుంటూ వచ్చింది. ‘దడఖ్’ సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ  తర్వాత రెండు మూడు సినిమాల్లో మెరిసింది. 
 

చివరిగా ‘మిలీ’ చిత్రంతో ఓటీటీ వేదికన ఆడియెన్స్ ను అలరించింది. సోషల్ మీడియాలో అందాలతో దుమ్ములేపుతున్న జాన్వీ కపూర్.. సినిమాల పరంగా మాత్రం తన పాత్రకు వెయిట్ ఉండేలా చూసుకుంటోంది. విభిన్న కథలను, పాత్రలను ఎంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో జాన్వీ చేతిలోకి మరిన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి.
 


అయితే జాన్వీ కపూర్ టాలీవుడ్ కు ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తుందా? అని తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురుచూశారు. ఫైనల్ గా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (NTR) సరసన NTR30లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇది జాన్వీకి మొదటి చిత్రం కానుంది. 
 

మొత్తానికి జాన్వీ కపూర్ ఎంట్రీ అదిరిపోనుందని అర్థమవుతోంది. ఈ క్రమంలో తెలుగులోనే మరిన్ని చిత్రాలు చేసే అవకాశం ఉంది. తాజాగా యంగ్ హీరో అక్కినేని అఖిల్ (Akkineni Akhil) చిత్రంలో నటించే అవకాశం ఉందని అంటున్నారు. మేకర్స్ ఈ బ్యూటీ పేరును పరిశీలిస్తున్నారంట. 

ఏజెంట్ తర్వాత అఖిల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ‘సాహో’కు వర్క్  చేసిన వ్యక్తే డైరెక్ట్ చేయయబోతున్నట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 
 

మరోవైపు బుచ్చిబాబు - రామ్ చరణ్ కాంబోలో వస్తున్న RC16లోనూ జాన్వీ హీరోయిన్ అంటున్నారు. అయితే NTR30 రిలీజ్ తర్వాత మరిన్ని ఆఫర్లు అందుకోబోతుందని తెలుస్తోంది. రీసెంట్ గానే బాలీవుడ్ లో ఉలజ్ (Ulajh) అనే చిత్రంలోనూ లీడ్ రోల్ లో నటిస్తోంది. సుధాన్షు సరియా దర్శకత్వం వహించనున్నారు.  

Latest Videos

click me!