హన్సికకి కాబోయే వరుడు ఎవరో తెలుసా.. బిజినెస్ పార్ట్నర్ నే పట్టేసిన యాపిల్ పిల్ల 

First Published | Oct 31, 2022, 4:33 PM IST

దేశ ముదురు చిత్రంతో మొదలైన హన్సిక హవా ఇంకా కొనసాగుతోంది. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది.

దేశ ముదురు చిత్రంతో మొదలైన హన్సిక హవా ఇంకా కొనసాగుతోంది. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది. ఇప్పటికే హన్సిక గ్లామర్ చూస్తే కుర్రాళ్లకు తెలియని అలజడి మొదలవుతుంది. 

టాలీవుడ్ లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతో హన్సిక ఆడి పాడింది. బొద్దుగా ఉండే హన్సిక గ్లామర్ చూసి యువత ఫిదా అయ్యారు. తమిళనాడులో అయితే హన్సికకు అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు.


అంతలా తన గ్లామర్ తో హన్సిక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హన్సిక తమిళంలో వరుస చిత్రాలు చేస్తోంది. హన్సిక తెలుగులో చివరగా తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బి అనే చిత్రంలో నటించింది. అతి త్వరలో హన్సిక పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె వివాహానికి ముహూర్తం కూడా ఖరారైందట. డిసెంబర్ 4న జైపూర్ లోని ముంటోడా ప్యాలెస్ లో హన్సిక వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. 

వివాహ వేడుక ఎంతో వైభవంగా జరిపించేందుకు కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు. యాపిల్ పండు లాంటి అందాలతో ఊరించే హన్సికకి కాబోయే వాడు ఎవరు అంటూ అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోతోంది. హన్సికకి కాబోయే వరుడు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. 

హన్సిక పెళ్లి చేసుకోబోతోంది ఆమె ప్రియుడినే అని అంటున్నారు. అతడి పేరు సోహైల్ కతురీయా. అతడు ముంబైకి చెందిన వ్యాపార వేత్త. బిజినెస్ పరంగానే సోహైల్, హన్సిక మధ్య పరిచయం ఏర్పడిందట. సోహైల్ కంపెనీలో హన్సికకి షేర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బిజినెస్ ద్వారా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. తమ రిలేషన్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకు వెళ్లేందుకు వివాహం చేసుకోవాలని ఈ జంట డిసైడ్ అయ్యారు. 

ఇక సినిమాల విషయానికి వస్తే.. హన్సిక నుంచి ఈ ఏడాది దాదాపు అరడజను చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. కెరీర్ గడిచే కొద్దీ హన్సిక కమర్షియల్ చిత్రాలు కాకుండా సోలో హీరోయిన్ గా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తోంది. 

Latest Videos

click me!