మళ్ళీ మొదటికొచ్చిన హృతిక్‌, కంగనా లవ్‌ స్టోరీ వివాదం.. మాటల యుద్ధం..

Published : Dec 17, 2020, 02:08 PM ISTUpdated : Dec 17, 2020, 02:09 PM IST

గ్రీక్‌ వీరుడు హృతిక్‌, ఫైర్‌ బ్రాండ్‌ కంగనా గతంలో ఘాటుగా ప్రేమించుకున్నారు. వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్‌ అప్పట్లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యింది. బ్రేకప్‌ చెప్పుకున్న చాలా రోజుల తర్వాత మరోసారి తెరపైకి వచ్చింది. వీరి వివాదం మళ్ళీ రాజుకుంది. హృతిక్‌పై కంగనా విమర్శలు గుప్పించింది. మాటల యుద్ధం ప్రారంభమైంది.

PREV
17
మళ్ళీ మొదటికొచ్చిన హృతిక్‌, కంగనా లవ్‌ స్టోరీ వివాదం.. మాటల యుద్ధం..
కంగనా రనౌత్‌ ఈ మెయిల్‌ ఐడీ నుంచి తనకు వరుసగా మెయిల్స్ వస్తున్నాయని చాలా ఇబ్బందిగా ఉన్నాయని హృతిక్‌ సైబర్‌ సెల్‌కి 2016 టైమ్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ ముందుకు సాగకపోవడంతో తన ఎఫ్ఐఆర్‌ని క్రైమ్‌ బ్రాంచ్‌కి తరలించాల్సిందిగా హృతిక్‌ ఇటీవల సైబర్‌ సెల్‌ని కోరాడు.

27
దీంతో ఎఫ్‌ఐఆర్‌ని క్రైమ్‌ బ్రాంచ్‌ `క్రైమ్‌ ఇంటలీజెన్స్ బ్యూరోకి తరలించారు. దీంతో తాజాగా దీనిపై కంగనా స్పందించింది. గురువారం సోషల్‌ మీడియా ద్వారా ఆమె మాట్లాడుతూ హృతిక్‌పై తీవ్ర స్థాయిలో మండిపడింది.

37
`హృతిక్‌ విచార గాధ మళ్ళీ మొదలైంది. అతను తన భార్య నుంచి విడాకులు తీసుకుని, నాతో విడిపోయి చాలా ఏళ్లు అవుతుంది. కానీ ఆయన తన జీవితంలో ముందుకు వెళ్ళడం లేదు. మరో అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించడం లేదు.

47
ధైర్యం కూడగట్టుకుని వ్యక్తిగత జీవితంపై ఆశతో నేను ముందుకు వెళ్తున్న సమయంలో హృతిక్‌ మళ్లీ పాత కథని తెరలేపాడు. చిన్నపాటి ఎఫైర్‌ని పట్టుకుని ఇంకా ఎంతకాలం ఎడుస్తావ్‌` అంటూ ఘాటుగా స్పందించింది కంగనా. ప్రస్తుతం కంగనా ట్వీట్‌ వైరల్‌ అవుతుంది. మరోవైపు హృతిక్‌ ఫ్యాన్స్ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.

57
2013-14 మధ్యకాలంలో కంగన రనౌత్‌ మెయిల్ ఐడీ నుంచి తనకు వందలాది మెయిల్స్ వచ్చాయంటూ హృతిక్‌ రోషన్‌ 2016లో ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో హృతిక్‌ తరపు న్యాయవాది మహేష్‌ జెఠ్మలానీ ఇటీవల సైబర్‌ సెల్‌ లేఖ రాశారు.

67
`2016 నుంచి ఇప్పటి వరకు ఈకేసులో ఎటువంటి పురోగతి లేదు. నటి కంగనా నుంచి వచ్చిన మెయిల్స్‌ కారణంగా అతడు, తన కుటుంబ సభ్యులు ఏవిధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారో పోలీసులకు ఆయన వివరించారు.

77
అంతేకాదు ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని ఉన్నత పోలీసు అధికారులను అతడు కోరారు. అయినప్పటికి ఈ కేసు విచారణ ముందుకు కదలలేదు. కావునా ఈ కేసును వెంటనే క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేయాలి` అని లేఖలో పేర్కొ‍న్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరు గతంలో ఘాటుగా ప్రేమలో మునిగితేలిసిన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories