వయసుతో పాటు అందం కూడా పెరుగుతుందా ఏంటీ... బ్లాక్ ట్రెండీ వేర్లో మెస్మరైజ్ చేస్తున్న తమన్నా!

Sambi Reddy | Published : Oct 26, 2023 4:58 PM
Google News Follow Us

పాల వన్నె ఛాయ తమన్నా భాటియాకు వయసు పెరుగుతున్న సూచనలు కనిపించడం లేదు. మూడు పదుల వయసు దాటినా టీనేజ్ గర్ల్ లా తోస్తుంది. ఆమె విషయంలో వయసు నెంబర్ మాత్రమే అనిపిస్తుంది. 
 

16
వయసుతో పాటు అందం కూడా పెరుగుతుందా ఏంటీ... బ్లాక్ ట్రెండీ వేర్లో మెస్మరైజ్ చేస్తున్న తమన్నా!
Tamannah Bhatia

బ్లాక్ ట్రెండీ వేర్లో తమన్నా లేటెస్ట్ ఫోటో షూట్ మెస్మరైజ్ చేస్తుంది. తమన్నా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  జైలర్ మూవీతో తమన్నా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆమె పాత్రకు ప్రాధాన్యత లేకున్నా కెరీర్లో ఫస్ట్ టైం రజినీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ దక్కింది. యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ ఆగస్టు 10న విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది. జైలర్ రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. జైలర్ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్ వంటి స్టార్ క్యాస్ట్ జైలర్ మూవీలో భాగమయ్యారు.
 

26
Tamannah Bhatia

అలాగే చిరంజీవికి జంటగా భోళా శంకర్ చేసింది. జైలర్, భోళా శంకర్ ఒక రోజు వ్యవధిలో విడుదలయ్యాయి. ఆగస్టు 11న  రిలీజ్ అయిన భోళా శంకర్ డిజాస్టర్ అయ్యింది. భారీ నష్టాలు మిగిల్చింది. భోళా శంకర్ తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్. కీర్తి సురేష్ కీలక రోల్ చేసింది. చిరంజీవి కెరీర్లో చెత్త సినిమాగా మిగిలిపోయింది. చిరంజీవితో తమన్నాకు భోళా శంకర్ రెండో చిత్రం. గతంలో సైరా నరసింహారెడ్డి చిత్రంలో తమన్నా-చిరంజీవితో జతకట్టారు. 

 

36
Tamannah Bhatia

ఇక రెండు దశాబ్దాలుగా ఆమె ప్రస్థానం కొనసాగుతుంది. గత ఏడాది తమన్నా పలు చిత్రాల్లో నటించారు. అంచనాల మధ్య విడుదలైన ఎఫ్ 3 పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. హిందీలో ప్లాన్ ఏ ప్లాన్ బి, బబ్లీ బౌన్సర్ వంటి చిత్రాలు చేశారు. సత్యదేవ్ కి జంటగా చేసిన గుర్తుందా శీతాకాలం ఆడలేదు.

Related Articles

46
Tamannah Bhatia

తమన్నాకు హ్యాపీడేస్ ఫేమ్ తెచ్చింది. 100 % లవ్ చిత్రంతో పరిశ్రమలో నిలదొక్కుకుంది. రెండు తరాల టాప్ స్టార్స్ తో నటించిన తమన్నా అనేక హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఇటీవల వెబ్ సిరీస్లలో దుమ్మురేపుతోంది. జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 రోజుల వ్యవధిలో ఓటీటీలో విడుదలయ్యాయి. ఈ సిరీస్లలో తమన్నా బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించారు. 

 

56
Tamannah Bhatia

ఈ రోజుల్లో కూడా జనాలు బోల్డ్ సన్నివేశాల గురించి మాట్లాడుకోవడం హాస్యాస్పదం. పాత్ర డిమాండ్ చేస్తే తప్పదని తమన్నా అంటున్నారు. కాగా తమన్నా నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తుంది. ఈ విషయాన్ని ఆమె ధృవీకరించారు. విజయ్ వర్మ చాలా కేరింగ్ పర్సన్, నాకు భద్రత కల్పిస్తాడనే భరోసా ఉంది. అందుకే ప్రేమించానని తమన్నా చెప్పుకొచ్చారు.
 

66
Tamannah Bhatia

విజయ్ వర్మను ప్రేమిస్తున్న తమన్నా పెళ్ళికి మాత్రం ఇంకా సమయం ఉందంటుంది. అప్పుడే ఆ ఆలోచన లేదంటుంది. ఈ క్రమంలో తమన్నా-విజయ్ వర్మ బంధం పెళ్లి వరకు వెళుతుందా అనే సందేహం కలుగుతుంది. 
 

Recommended Photos