జిమ్ ముఖం తెలియని హీరోయిన్ సాయి పల్లవి..? మరి అంత ఫిట్ నెస్ ఎలా మెయింటేన్ చేస్తుందంటే..?

First Published | Oct 21, 2022, 1:36 PM IST

హీరోయిన్ సాయి పల్లవిని చూస్తే.. ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. నాజూగ్గా.. మెలికలు తిరిగిన సన్నజాని తీగలాగా ఉంటుంది. ఫిట్ గా ఉంటుంది. మరి సాయి పల్లవి ఇలా ఫిడ్ గా ఉండటానికి కారణం ఏంటీ..? అందుకోసం ఆమె ఏం చేస్తుంది...? 
 

Sai Pallavi

ఫిట్ నెస్ విషయంలో తన రూటే సెపరేటు అంటోంది హీరోయిన్ సాయి పల్లవి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పటిలా కాదు.. ఇప్పుడు హీరో అయినా.. హీరోయిన్ అయినా.. పిట్ గా ఉండాల్సిందే. హీరో అయితే కనీసం లోపల సిక్స్ ప్యాక్.. హీరోయిన్ అయితే జీరో ఫ్యాక్ లేకుండా సన్నని నడుము, చక్కటి షేపులు ఉండాలి. లేదంటే అటు వైపు తిరిగి కూడా చూడరు ఆడియన్స్. 

అందుకే ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు అందరూ తమ ఫిట్నెస్  కోసం జిమ్ముల చుట్టు ప్రదక్షణలు చేస్తుంన్నారు. గంటలుగంటలు కసతరత్తులు చేస్తూ.. మంచి ఫిజిక్ ను  మైంటైన్ చేయడానికి ఆరాటపడుతున్నారు. కేవలం స్టార్ హీరోయిన్స్  మాత్రమే కాదు కాస్త డబ్బున్న ప్రతీ ఒక్కరు ఇప్పుడు జిమ్ము బాట పడుతున్నారు. 


ప్రస్తుతం ఇండస్ట్రీలో  స్టార్ సెలబ్రిటీలు ప్రత్యేకంగా ట్రైనర్స్ ను పెట్టుకుని వాటర్ డైట్ అని.. ప్లాంట్ బేస్డ్ డైట్ అని ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ రకరకాల పార్ములాలు ఉపయోగించి ఫిట్ నెస్ కాపాడుకుంటున్నారు. ఈ విషయంలో సాయి పల్లవి మాత్రం నేను డిఫరెంట్ అంటుంది. ఎటువంటి డైట్ కాని.. జిమ్ కాని వాడటం తనకు అస్సలు ఇష్టం లేదు అంటోంది. 

ఇంత వరకూ తాను జిమ్ ముఖమే చూడలేదంటోంది సాయి పల్లవి. తనకు జిమ్ లు .. డైట్ లు అస్సలు పడటవట. వాటి పేరుతో కడుపు మార్చుకోవడం ఇష్టం ఉండదట. ఇక  ఆమె మూడు పూటలా తనకు ఇష్టమైన వంటలతో కడుపునిండా భోజనం చేస్తుందట . మరి అలాంటి లైఫ్ స్టైల్ లో ఇంత ఫిట్ నెస్ ను.. అంత కరెక్ట్ ఫిజిక్ ను  సాయి పల్లవి ఎలా మెయింట్ చేస్తుంది. 

మెడిసిన్ చదివిని సాయి పల్లవికి మొదటి నుంచీ తన బాడీ మీద తనకు కంట్రోల్ ఉందట. తను ఏం తిన్నా.. ఎంత తిన్నా కాని..  తన బాడీని కరెక్ట్ గా ఫిజిక్ లో పెట్టుకోవడానికి హెల్తీగా ఉండడానికి ..సాయి పల్లవి ఇంట్లోనే అన్ని పనులు చేసుకుంటూ తనను తను కంట్రోల్ లో పెట్టుకుంటుందట. ఇంట్లో పనులు పర్పెక్ట్ గా చేస్తే చాలు అదే జిమ్ అయిపోతుంది అంటోంది సాయి పల్లవి. 

అంతే కాదు స్వతహాగా సాయి పల్లవి మంచి డాన్సర్. తనకు టైమ్ ఉన్నప్పుడు  ఎంత సేపు వీలు అయితే అంత సేపు డాన్స్ చేస్తుందట. దాని వల్ల ఆమె ఒంటో ఉన్న ప్రతీ పార్ట్ కదిలి ఫ్యాట్ బర్న్ అవుతుంది. డాన్స్ ను మించిన వర్కైట్ లేదు అంటోంది సాయి పల్లవి. డాన్స్ రెగ్యూలర్ ప్రాక్టీస్ ఉన్నవారు ఎప్పుడూ ఫిట్ గా ఉంటారంటోంది. 
 

ఇంట్లో ఉన్నప్పుడు ఒక సాధారణ అమ్మాయిలాగా ఇల్లు ఊడ్చడం..  బట్టలు ఉతుకడం..తో పాటు అంట్లు కూడా తానే తోముకుంటుందట సాయి పల్లవి. అంతే కాదు ఉదయాన్నే .సూర్య నమస్కారాలు చేస్తుందట..  ఎలాంటి డైట్ ఫాలో అవ్వదు కాని. తనకు మొదటి నుంచీ అలవాటు ఉన్న పుడ్ నే తింటుందట. సాయి పల్లవి ప్లేట్ లో హెల్డీ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. 

ఉదయం  రాగి జావా , రెండు ఇడ్లి.. మధ్యహ్నం రసం అన్నం ఒక వెజిటేబుల్స్ ఫ్రై.. ఈవినింగ్ రెండు చపాతి ..అంతే ఇలానే తన ఫుడ్ డైట్ ను ఫాలో చేస్తుందట. ఇంత నాజూగ్గా కనిపిస్తున్న  సాయి పల్లవికి విచిత్రంగా స్వీట్స్ అంటే ఎంతో ఇష్టమట. తినకుండ నోరు కట్టేసుకోవడం మాత్రం అలవాటు లేదట. తనకు ఇష్టమైన స్వీట్స్ అన్నీ లాంగించేస్తుందట సాయి పల్లవి.  

డాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది సాయి పల్లవి. టాలీవుడ్ లో  ఫిదా సినిమాతో  పరిచయమై ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అంతేకాదు సాయి పల్లవి అందరు హీరోయన్లలా కాకుండా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ.. హీరోయిన్లకే ఆదర్శంగా నిలుస్తుంది. దాంతో ఆమె ఇండస్ట్రీలో ఓ స్పెషల్ మార్క్ కూడా ఏర్పాటు చేసుకుంది. 
 

ముఖ్యంగా కోట్లు ఇచ్చినా కమర్షియల్ యాడ్స్ చేయకపోవడం, మేకప్ తక్కువగా వేసుకోవడం, నేచురల్ లుక్స్ మెయింటేన్ చేయడం. ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉండట. పరిమితిని మించి ఫ్యాషన్ వేర్ వేసుకోకపోవడం లాంటి చాలా విషయాలు సాయి  పల్లవిని స్పెషల్ గా నిలబెట్టాయి. అంతే కాదు హ్యూజ్ ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి మెయిన్ రీజన్ గా మారాయి. 

Latest Videos

click me!