స్టార్ హీరోను స్టేజ్ పైనే అవమానించిన హీరోయిన్ మీనా తల్లి...?

Published : May 29, 2023, 10:47 AM ISTUpdated : May 29, 2023, 10:49 AM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూ చెప్పలేదు. ఆనందాలు, అవమానాలు కామన్. అది స్టార్ హీరోలు అయినా.. జూనియర్ ఆర్టిస్ట్ లు అయినా ఏదో ఒక సందర్భంలో తప్పవు. ఈక్రమంలో హీరోయిన్ మీనా  మదర్ ఓ స్టార్ హీరోను స్టేజ్ పైనే అవమానించిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.   

PREV
16
స్టార్ హీరోను స్టేజ్ పైనే అవమానించిన హీరోయిన్ మీనా తల్లి...?

ఒకప్పుడు  తెలుగు తెరను ఒక ఊపు ఊపి వదిలిపెట్టింది హీరోయిన్ మీన. తన అందం, అభినయంతో కుర్రాళ్ల మనసులు దోచేసింది. స్టార్ హీరోల సరసన గ్లామర్ రోల్స్ లో మీనా అభినయం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.  ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది మీదన విమర్శకుల చేత శభాష్ అనిపించింది. 

26

ఇక హీరోయిన్ గా పెయిడ్ అవుట్ అయినా.. ఏమాత్రం గ్లామర్ తగ్గలేదు మీనాకు.  నాలుగు పదుల వయసులో కూడా నవయవ్వనంతో మెరిసిపోతోంది. ఏజ్ పెరుగుతున్నా.. ఆమె అందం మాత్రం ఇప్పటికి చెక్కు చెదరలేదు. లాస్ట్ ఇయర్ భర్తను కోల్పోయిన మీనా.. ఇప్పుడిప్పుడే  కోలుకుని సినిమాల్లో యాక్టీవ్ అవుతుంది. 

36

ఇది ఇలా ఉంటే.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే మీనా తల్లి వల్ల అప్పట్లో ఓ స్టార్ హీరోకి అవమానం జరిగిందట. ఈ విషయం ఇప్పుడు హైలెట్ అవుతుంది.  తమిళనాట  రజినీకాంత్ తర్వాత ఎక్కువగా అభిమానులు ఉన్న హీరోలలో అజిత్ కూడా ఒకరు. ఆయనకు కోలీవుడ్ తో పాటు.. టాలీవుడ్ లో కూడా  ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడ కూడా మంచి మార్కెట్  ఉంది. 
 

46

ప్రస్తుతం అజిత్ వయస్సు పెరుగుతున్నా.. ఏమాత్రం ఇమేజ్ తగ్గడంలేదు.  కుర్ర హీరోలకు సైతం అజిత్ గట్టి పోటి ఇస్తున్నారు. .
ఇక అప్పట్లో.. మీనా, అజిత్ కాంబినేషన్ కు మంచి డిమాండ్ ఉంది.  కలిసి చేసిన సినిమాలు తక్కువే అయినా.. ఇద్దరు మంచి జోడీగా  గుర్తింపు వచ్చింది. వీరిద్దరు తమిళంలో  ఆనంద పూంకట్రు అనే  సినిమాలో నటించగా...ఆ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. 
 

56

ఈ సినిమాకుగాను  అజిత్ కు బెస్ట్ యాక్టర్ గా  అవార్డు కూడా దక్కింది. ఈ సందర్భంగా అజిత్  ను సత్కరించి సన్మానం కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హీరోయిన్ మీనా.. అజిత్ కు  అవార్డు ఇచ్చింది. ఇక ఆ శుభ సందర్భంలో.. అజిత్, మీనా కలిసి స్టేజ్ పై డ్యాన్స్ చేయాలంటూ కార్యక్రమం నిర్వహించే యాంకర్ కోరారు. దాంతో ఈ అనౌన్స్ మెంట్ విన్న  మీనా తల్లి.. వెంటనే స్టేజ్ మీదకు వచ్చింది.

66

అందరూ చూస్తుండగానే డయాస్ మీదకు వచ్చిన  మీనా... చేయి పట్టుకుని కిందకు  తీసుకెళ్లింది. దాంత అక్కడ ఉన్నవారంతా అవాక్ అయ్యారు. మీనా తల్లి అలా చేయడంతో అజిత్ బాధపడ్డారు.  అందరి ముందు ఆయన  అవమానించబడ్డాడు. అయితే మీనా తల్లి అందరూ చూస్తుండగానే ఇలా చేయడంతో ఆమె తీరుపై విమర్షలు వచ్చాయి. అజిత్ ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు. ఇక ఇప్పటిలా అప్పుడు కూడా సోషల్ మీడియా ఉండి ఉంటే.. ట్రోలింగ్ తో హోరెత్తి పోయేదేమో.. కదా. 

Read more Photos on
click me!

Recommended Stories