సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్న ప్లాట్ ను కొన్న అదా శర్మ..? నోరు తీపి చేస్తానంటున్న బ్యూటీ..

Published : Aug 29, 2023, 05:52 PM ISTUpdated : Aug 29, 2023, 06:41 PM IST

కెరీర్ అయిపోతోంది అనుకున్న టైమ్ లో కేరళ స్టోరీ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది అదా శర్మ. ఈక్రమంలో అదా శర్మ ఏదో ఒక న్యూస్ తో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ఆమె తాజాగా ఓ సాహసం చేసినట్టు తెలుస్తోంది. 

PREV
16
సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్న ప్లాట్  ను కొన్న అదా శర్మ..? నోరు తీపి చేస్తానంటున్న బ్యూటీ..
Photo Courtesy: Instagram

బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసినా... హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు నిజంగానే హార్ట్ ఎటాక్ అయ్యేలా చేసింది బాలీవుడ్ బ్యూటీ అదాశర్మ. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసినా ఆమెకు స్టార్ డమ్ రాలేదు. అంతే కాదు ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలే వరించాయి టాలీవుడ్ లో. ముఖ్యంగా ఆమె..  సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, క్ష‌ణం లాంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. 

26
Adah Sharma_Sushant Singh Rajput

ది కేరళ స్టోరీ సినిమాతో  మంచి స‌క్సెస్‌ను అందుకుంది. కేరళలో జరిగిన అమ్మాయిల మిస్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించింది. తాజాగా అమ్మ‌డికి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దివంగ‌త బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న ప్లాట్‌ను అదా శ‌ర్మ కొనుగోలు చేసింద‌నే న్యూస్ వైర‌ల్‌గా మార‌గా దీనిపై ఆమె స్పందించింది.

36
Sushant Singh's 'ghost bungalow' bought by Adah Sharma- What did the actress say

బాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో... సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ త‌న కెరీర్ మంచి పీక్ స్టేజ్‌లో ఉన్న టైమ్ లో సూసైడ్ చేసుకున్నారు.  ముంబై బాంద్రాలోని ఓ ఫ్లాట్‌లో అద్దెకు ఉండే సుశాంత్.. ఆఇంట్లోని తన బెడ్ రూమ్ ల ఉరివేసుకుని మరణించాడు. అయితే ఆ ప్లాట్ చాలా ప్పెషల్ గా ఉంటుందట.  స‌ముద్రానికి ఎదురుగా ఉన్న ఈ ప్లాట్‌కు అత‌డు నెల‌కు దాదాపు ర 4.5ల‌క్ష‌లు కట్టేవారని సమాచారం. 

46

అయితే.. 2020 జూన్ 14న తాను నివ‌సిస్తున్న ప్లాట్‌లోనే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అత‌డి మ‌ర‌ణం అంద‌రిని షాక్‌కు గురి చేసింది. ఆయ‌న ఎందుకు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు అన్న సంగ‌తి ఇంత వ‌ర‌కు తెలియ‌రాలేదు.సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న త‌రువాత ఆ ప్లాట్‌లో అద్దెకు ఉండేందుకు ఎవ‌రూ ముందుకు రాలేద‌ట‌. కొంద‌రు ఆ ప్లాట్‌ను కొనేందుకు ముందుకు వ‌చ్చినా.. ఆ ఇంటి య‌జ‌మాని మాత్రం అద్దెకు ఇచ్చేందుకు మాత్ర‌మే ఇష్ట‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. 

56

ఇక తాజాగా ఆ ప్లాన్ ను కొనడానికి అదా శ‌ర్మ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఓనర్ ను ఒప్పించి  కొనుగోలు చేసిన‌ట్లు కొన్ని రోజులుగా  బాలీవుడ్ కోడై కూస్తోంది. ఇక ఈ విషయంలో తాజాగా  అదాశ‌ర్మ ఎట్ట‌కేల‌కు మౌనం వీడింది.మీడియా ఈ విషయాన్ని ఆమె ముందు  ప్ర‌స్తావించ‌గా అలాందిటి ఏదైన ఉంటే తానే ముందుగా చెబుతాన‌ని చెప్పింది. మీకు ప్రామిస్ చేస్తున్నా అలాంటిది ఏదైన ఉంటే మీ అందరి నోళ్ల‌ను తీపి చేస్తా అంటూ అదా తెలిపింది.

66

దాంతో అసలు ఆప్లాన్ ను ఆమె కొనలేదని తెలుస్తోంది. అయితే.. ఈ విషయంలో పుకార్లు ఎందుకు వచ్చాయో తెలియడం లేదు. ఎక్కడ స్టార్ట్ అయ్యాయో కూడా తెలియదు. ఇక పోతే.. అదా శర్మ కెరీర్ అయిపోయింది అనుకుంటున్న టైమ్ లో ఆమె మళ్ళీ బిజీ అయిపోయింది. గ్యాప్ లేకుండా షూటింగ్స్ చేస్తోందిత. 

click me!

Recommended Stories