హన్సిక మెహందీ వేడుక.. కాబోయే భర్తతో రొమాన్స్ మొదలు పెట్టిన యాపిల్ పిల్ల, పిక్స్ వైరల్

Published : Dec 02, 2022, 05:52 PM IST

ఆల్రెడీ హన్సిక, సోహైల్ పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. తాజాగా మెహందీ వేడుకకి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.

PREV
18
హన్సిక మెహందీ వేడుక.. కాబోయే భర్తతో రొమాన్స్ మొదలు పెట్టిన యాపిల్ పిల్ల, పిక్స్ వైరల్

అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది. ఇప్పటికే హన్సిక గ్లామర్ చూస్తే కుర్రాళ్లకు తెలియని అలజడి మొదలవుతుంది. 

28

టాలీవుడ్ లో ఎన్టీఆర్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతో హన్సిక ఆడి పాడింది. బొద్దుగా ఉండే హన్సిక గ్లామర్ చూసి యువత ఫిదా అయ్యారు. తమిళనాడులో అయితే హన్సికకు అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు. పాలబుగ్గల అందంతో హన్సిక ఇప్పటికీ కుర్రాళ్లకి ఒక మిస్టరీగా మారిపోయింది. 

38

 డిసెంబర్ 4న జైపూర్ లోని ముంటోడా ప్యాలెస్ లో హన్సిక వివాహం జరగనుంది. ఇటీవల సోషల్ మీడియాలో హన్సిక తన ఫియాన్సీని అభిమానులకు పరిచయం చేసింది. ప్యారిస్ లో ఈఫిల్ టవర్ వద్ద ప్రియుడితో ఉన్న రొమాంటిక్ పిక్స్ ని హన్సిక షేర్ చేసింది. 

48

దీనితో హన్సికకి కాబోయే వరుడు గురించి నెటిజన్లు ఒక్కో విషయం తెలుసుకోవడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో షాకింగ్ మ్యాటర్ లీక్ అయింది. హన్సికకి కాబోయే వరుడి పేరు సోహైల్ కతూరియా.  అతడు ముంబైకి చెందిన వ్యాపార వేత్త. బిజినెస్ పరంగానే సోహైల్, హన్సిక మధ్య పరిచయం ఏర్పడిందట. 

58

సోహైల్ కంపెనీలో హన్సికకి షేర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బిజినెస్ ద్వారా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. తమ రిలేషన్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకు వెళ్లేందుకు వివాహం చేసుకోవాలని ఈ జంట డిసైడ్ అయ్యారు. 

68

ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే సోహైల్ కి ఆల్రెడీ వివాహం జరిగింది. అతడికి ఇది రెండవ వివాహం. సోహైల్ కి 2016లో రింకీ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత హన్సిక ప్రేమలో సోహైల్ పడ్డాడు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే రింకీ, హన్సిక బెస్ట్ ఫ్రెండ్స్. రింకీ, సోహైల్ వివాహానికి కూడా హన్సిక హాజరైంది. 

78

ఇప్పుడు తన స్నేహితురాలి మాజీ భర్తనే హన్సిక వివాహం చేసుకోబోతోంది. ఆల్రెడీ హన్సిక, సోహైల్ పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. తాజాగా మెహందీ వేడుకకి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. హన్సిక తన ఫియాన్సీ సోహైల్ తో కలసి అప్పుడే రొమాన్స్ మొదలు పెట్టేసింది. ఇద్దరూ ఆడుతూ పడుతూ చాలా సంతోషంగా, అందంగా కనిపిస్తున్నారు. ఈ జంట చూడముచ్చటగా ఉందంటూ కామెంట్స్ మొదలయ్యాయి. 

88

ఇటీవల హన్సిక తన ఫ్రెండ్స్ తో కలసి గ్రీస్ లో బ్యాచిలర్ పార్టీ ఎంజాయ్ చేస్తోంది. ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో పంచుకుంది. డ్యాన్స్ చేస్తూ, డ్రింక్స్ ఎంజాయ్ చేస్తూ హన్సిక తన లేడీ గ్యాంగ్ తో ఒక రేంజ్ లో రచ్చ చేసింది. ఇదిలా ఉండగా హన్సికకి కూడా గతంలో ఎఫైర్స్ ఉన్నాయి. హీరో శింబుతో ఆమె ప్రేమ వ్యవహారం పెళ్లి పీటల వరకు వెళ్లి ఆగిపోయిన సంగతి రహస్యం ఏమీ కాదు. సెలెబ్రిటీల పెళ్లిళ్లు అంటే ఫ్యాన్స్ కి ఆ మాత్రం షాకులు తప్పవు.  

click me!

Recommended Stories