తరుణ్ చేసిన తప్పు ఇదే...
తరుణ్ కి అప్పట్లో లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది. ఆయన చేసిన లవ్ స్టోరీలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే.. ఆ ఇమేజ్ పోగొట్టుకోవడానికి తరుణ్ ప్రయత్నించాడని.. అదే దెబ్బ కొట్టిందని డైరెక్టర్ విజయ్ భాస్కర్ చెప్పారు. అప్పట్లో మిగిలిన హీరోలు అందరూ.. మాస్ సినిమాలు, యాక్షన్ సినిమాలు చేసి... సూపర్ హిట్ అవుతున్నారని.. తరుణ్ కూడా ఆ దారిలో వెళ్లాలని అనుకున్నాడని. ఆయన అన్నారు. ఆ సినిమాలు వర్కౌట్ అవ్వకపోవడంతో..సినిమాలు ప్లాప్ అయ్యాయని చెప్పారు. అయితే.. ‘నేను తరుణ్ కి సలహా ఇచ్చాను... అందరూ యాక్షన్ సినిమాలు చేసినా.. నువ్వు కూడా అవే చేయాల్సిన అవసరం లేదని చెప్పాను.. నీ అభిమానులు నీకు ఉంటారు.. నువ్వు రొమాంటిక్ సినిమాలు కంటిన్యూ చేయమని చెప్పాను. కానీ తరుణ్ వినలేదు’ అని విజయ్ భాస్కర్ గారు అన్నారు. తర్వాత నేను కూడా తరుణ్ తో భలే దొంగలు సినిమా ట్రై చేశాను కానీ.. అది వర్కౌట్ కాలేదని ఆయన చెప్పారు
తరుణ్ కేవలం నటుడే కాదు, సినిమా పట్ల అతనికి మంచి అవగాహన ఉందని విజయ భాస్కర్ ప్రశంసించారు.స్క్రిప్ట్ సెలక్షన్‌లో తరుణ్ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, కొన్నిసార్లు కాలం కలిసిరాదు.సినిమా విజయంలో "సరైన స్క్రిప్ట్ - సరైన సమయం" చాలా ముఖ్యం. తరుణ్‌కు నటన వచ్చు, ఇమేజ్ ఉంది, కానీ ఆయన శైలికి తగ్గ బలమైన కథలు (Scripts) పడకపోవడమే ఆయన కెరీర్ నెమ్మదించడానికి ప్రధాన కారణమని దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు.
"ఇంకొకరి లాంటి సినిమాలు చేయాల్సిన అవసరం లేదు.. నేను ఎప్పుడూ ఇంకొకరు లాంటి సినిమాలు చేయాలి అనుకోను.. ఎవరి దారి వారిదే’ అని ఆయన అన్నారు.