చిరంజీవి నెక్ట్స్ ప్రాజెక్టులు, లిస్ట్ లో టాప్ డైరక్టర్స్ , మామూలుగా లేదు

First Published | Dec 7, 2024, 7:40 AM IST

మెగాస్టార్ చిరంజీవి వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. విశ్వంభర తర్వాత బీవీఎస్ రవి, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల, సందీప్ రెడ్డి వంగా, వీవీ వినాయక్ వంటి దర్శకులతో సినిమాలు చేసే అవకాశం ఉంది.


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరస ఇంట్రస్టెంగ్ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో వచ్చిన డిజాస్టర్స్ ఆచార్య, భోళాశంకర్ లతో ఆయన జాగ్రత్తపడటం మొదలెట్టారు. కేవలం తన సినిమాలు చూసి ఫ్యాన్స్ మాత్రమే ఆనందించలని కాకుండా వైడ్ ఆడియన్స్ కోసం కథలను , డైరక్టర్స్ ని ఎంచుకోవటం మొదలెట్టారు.

మెగాస్టార్ తన  రొటీన్ కమర్షియల్ సినిమాల నుంచి బయటకు రావాలని అభిమానులు కోరిక మేరకు తన పంధాని మార్చుకుంటున్నారు. ఆయన తోటి హీరోలు రజినీకాంత్, మమ్ముట్టి, కమల్ లాగా ముందుకు వెళ్లాలని చిరంజీవి భావిస్తున్నారు. 


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి  చేస్తున్న  "విశ్వంభర" తరువాత చేయబోయే సినిమాల గురించి  అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దర్శక, రచయిత బీవీఎస్ రవి ఇప్పటికే  ఒక కథ రాసి చిరంజీవిని మెప్పించారు. మోహన్ రాజా ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించేందుకు ముందుకొచ్చారు, కానీ  ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న  సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఆపేసారు. 
 



హరీష్ శంకర్ తో సినిమా 

మరో ప్రక్క ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ తో చిరంజీవితో చర్చలు జరుపుతున్నారు. చిరంజీవిని ఓ కమర్షియల్ షూట్‌లో మెప్పించిన హరీశ్‌కు ఆయన పూర్తి స్క్రిప్ట్‌పై పని చేయమని సూచించారు. ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఉంది, కానీ వెంటనే ప్రారంభమయ్యే అవకాశం అయితే లేదు.

చిరంజీవి తన వరస లిస్ట్ లో ఈ ప్రాజెక్టుని  పెట్టుకున్నారు.  2025 చివర్లో ఈ ప్రాజెక్టు ప్రకటించే అవకాసం ఉంది. ఈ  ప్రాజెక్ట్‌ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతున్నారు.  


అనిల్ రావిపూడితో సినిమా: 

కెరీర్ ప్రారంభం నుంచి అపజయం ఎరగని డైరక్టర్ గా ముద్రపడ్డ  దర్శకుడు అనిల్ రావిపూడి  చాలా కాలంగా ఓ ప్రాజెక్టు చేయటం కోసం మెగాస్టార్ చిరంజీవితో చర్చలు జరుపుతున్నారు. "ఎఫ్2" బ్లాక్‌బస్టర్ తర్వాత, చిరంజీవి స్వయంగా అనిల్‌ను సంప్రదించి, ఒక మంచి కామెడీ కథపై పని చేయమని కోరారు.

ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు రూపొందటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 2025 వేసవిలో షూటింగ్ ప్రారంభం కానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిత్రం: 

ఇప్పటికే 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి మరో ప్రాజెక్ట్‌కు సైన్ చేశారు. ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్నారు. నాని ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ సినిమా చాలా వైలెంట్ గా యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతోందని సమాచారం. 
 

Chiranjeevi


సందీప్ రెడ్డి వంగా తో సినిమా:

 "యానిమల్" ఫేమ్ సందీప్ రెడ్డి వంగా మెగాస్టార్ చిరంజీవి పెద్ద అభిమాని. ఈ విషయం సందీప్ రెడ్డి వంగా చాలా సార్లు మీడియా ముందు చెప్పారు. ఈ  కాంబినేషన్ లో సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి.

అయితే అన్నీ అనుకూలిస్తే  వచ్చే సంవత్సరానికి ఈ ప్రాజెక్ట్ ఖరారు అయ్యే అవకాశం ఉంది. సందీప్ రెడ్డి చిరంజీవికి త్వరలో కథ వినిపించేందుకు సిద్దపడుతున్నారు.  ఈ చిత్రం 2027లో ప్రారంభమయ్యే అవకాశముంది.

Chiranjeevi, vishwambara, release date


విశ్వంభర విషయానికి వస్తే... చిరంజీవి 156వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ జానర్‌లో వస్తోంది. 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా విడుదలైన టీజర్‌లో చిరంజీవి పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు. ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది. 

Chiranjeevi, Viswambhara, Sankranthi


మరో ప్రక్క వీవీ వినాయక్‌తో చర్చలు: స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఇటీవల 'విశ్వంభర' సెట్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా చిరంజీవితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. దీంతో, వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  త్వరలో చిరంజీవి తన తదుపరి ప్రాజెక్టులపై మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. 

Latest Videos

click me!