ఫిట్ నెస్ కోసం జాక్వెలిన్ ఏరియల్ యోగా.. ఫిదా అయిన మిల్క్ బ్యూటీ తమన్నా.. వైరల్ పిక్స్..

First Published | Apr 12, 2023, 1:32 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్  (Jacqueline Fernandez) తన ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకోగా.. మిల్క్ బ్యూటీ తమన్నా స్పందించారు. 
 

స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్  తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతగానో పరిచయం అయ్యారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘సాహో’ చిత్రంలో చిందులేసిన ఈ ముద్దుగుమ్మ తొలి సాంగ్ తోనే తెలుగు ఆడియెన్స్ గుండెల్ని కొల్లగొట్టింది. సౌత్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది.
 

చివరిగా సౌత్ లో కన్నడ చిత్రం ‘విక్రాంత్ రోణా’లో స్పెషల్ అపియరెన్స్ తో అలరించిన విషయం తెలిసిందే. ‘రా రా రక్కమ్మ’ సాంగ్ తో యువతను ఉర్రూతలూగించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస చిత్రాలతో అలరిస్తోంది. చివరిగా ‘సెల్పీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
 


సినిమాలతో బిజీగా ఉన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా జాక్వెలిన్ పంచుకున్న పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
 

తాజాగా ఈ బాలీవుడ్ భామ షేర్ చేసిన పిక్స్ అభిమానులతో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.  తన ఫిట్ నెస్ కోసం జాక్వెలిన్ ఏకంగా ఏరియల్ యోగితో గాల్లో కఠిన ఆసనాలు వేశారు. ఆ ఫొటోలను అభిమానుతో పంచుకున్నారు. ఫిట్ నెస్ కోసం జాక్వెలిన్ ఇంతలా శ్రమిస్తుండటంతో ఫ్యాన్స్ పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

బ్లాక్ వర్కౌట్ డ్రెస్ లో బాడీ స్ట్రక్చర్ ను చూపిస్తూ యువతను కట్టిపడేస్తోంది. జాక్వెలిన్ పంచుకున్న ఫొటోలపై ఏకంగా మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా కూడా స్పందించారు. జాక్వెలిన్ పంచుకున్న ఆ ఫొటోలను లైక్ చేసి అభినందించింది. మరోవైపు నెటిజన్లు కూడా లైక్స్ తో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. 

ఇక జాక్వెలిన్ రూ.200 కోట్ల కుంభకోణంలో నిందితులుగా ఉన్న సుఖేశ్ చంద్రతో కొన్నాళ్లు లవ్ ట్రాక్ నడిపించింది. దీంతో ఆ కుంభకోణంలోనూ ఆరోపణలు ఎదుర్కొంటోంది. పలమార్లు విచారణకు హాజరవుతోంది. మరోవైపు సినిమాలతోనూ బిజీగా ఉంది. ప్రస్తుతం ‘క్రాక్’, ‘ఫతే’ చిత్రాల్లో నటిస్తోంది.

Latest Videos

click me!