మరో సోనియాలా తయారైన విష్ణుప్రియ, టైటిల్ రేసు నుండి అవుట్!

First Published | Oct 10, 2024, 12:53 PM IST

టైటిల్ రేసులో ఉంటుందనుకున్న విష్ణుప్రియకు అంత సీన్ లేదని తేలిపోయింది. ఆమె పూర్తిగా గేమ్ పక్కన పెట్టేసింది. టైటిల్ సంగతి అటుంచితే... మరో రెండు మూడు వారాలు హౌస్లో ఉండటమే కష్టం అనే వాదన మొదలైంది.. 
 

బిగ్ బాస్ హౌస్లో ఉండటం అంత సులభం కాదు. ఆకలికి, నిద్రకు, మానసిక, శారీరక దృఢత్వానికి పరీక్ష పెడతారు. వీటన్నింటికీ మించి... రిలేషన్స్, బిహేవియర్, మాటతీరు, హానెస్ట్ గేమ్.. ప్రేక్షకుల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. కొందరు కంటెస్టెంట్స్ ప్రవర్తన ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. ఈ క్రమంలో వారిపై అత్యంత నెగిటివిటీ నడుస్తుంది. 
 

సీజన్ 8కి గాను సోనియా ఆకుల ప్రేక్షకుల వ్యతిరేకతను ఎదుర్కొంది. ఇద్దరు అబ్బాయిలతో ఆమె సన్నిహితంగా ఉండటం ఆడియన్స్ కి నచ్చలేదు. బ్రదర్స్ అంటూనే వల్గర్ బాడీ లాంగ్వేజ్ సోనియాను అబాసుపాలు చేసింది. నిఖిల్ పక్కన కూర్చుని అతని చెస్ట్ పై అభ్యంతరకరంగా సోనియా తాకింది. పృథ్వి, నిఖిల్ లతో సోనియా ఇబ్బందికర ప్రవర్తనకు సంబంధించిన పలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

అలాగే పృథ్వి, నిఖిల్ గేమ్స్ ని ఆమె ప్రభావితం చేయడం కూడా నచ్చలేదు. ఈ విషయంలో హోస్ట్ నాగార్జున నేరుగా నిఖిల్ కి క్లాస్ పీకాడు. తోటి కంటెస్టెంట్స్ సైతం నిఖిల్ గేమ్ ని, నిర్ణయాలను సోనియా ప్రభావితం చేస్తుందని చెప్పారు. వెరసి.. కనీసం పది వారాలు హౌస్లో ఉంటుందనుకున్న సోనియా.. నాలుగు వారాలకే ఎలిమినేట్ అయ్యింది. 


కాగా సోనియా బయటకు వచ్చాక.. ఆమె స్థానం విష్ణుప్రియ తీసుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ వీక్ నుండి పృథ్వి పై విష్ణుప్రియకు గురి ఉంది. అతనితో సమయం గడిపేందుకు ఆమె ఇష్టపడుతుంది. కానీ సోనియా అడ్డుగా ఉండేది. విష్ణుప్రియకు పృథ్వితో మాట్లాడే ఛాన్స్ తక్కువగా వచ్చేది. సోనియా ఎలిమినేట్ కావడంతో విష్ణుప్రియ పృథ్వితోనే ఉంటుంది. 

అసలు ఆమె గేమ్ పూర్తిగా పక్కన పెట్టేసింది. ప్రస్తుతం హౌస్లో హోటల్ టాస్క్ నడుస్తుంది. కంటెంట్ ఇచ్చేందుకు ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. ఎపిసోడ్స్ లో కానీ ప్రోమోలలో కానీ విష్ణుప్రియ మార్క్ కనిపించడం లేదు. పృథ్వితో ఆమె రొమాంటిక్ వీడియోలు మాత్రమే బయటకు వస్తున్నాయి. 

Bigg boss telugu 8

గేమ్ పరంగా ఆమె నిరూపించుకునే ప్రయత్నం చేయడం లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పలువురు కంటెస్టెంట్స్ విష్ణుప్రియను నామినేట్ చేశారు. నువ్వు గేమ్ ఆడటం లేదని కారణం చెప్పారు. ఐదు వారాలు తమ ఆట చూసి వచ్చిన కంటెస్టెంట్స్, నామినేషన్స్ లో చెప్పినా.. విష్ణుప్రియ తన గేమ్ మార్చుకోకపోవడం విడ్డూరం. 

తాను అందరి కంటే సెలెబ్రిటీ... ఆటోమేటిక్ గా ఓట్లు పడతాయని ఆమె భావిస్తూ ఉండొచ్చు. అసలు పృథ్వి మాయలో పడి గేమ్ వదిలేయడం విడ్డూరం. వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత ఆమెకున్న టాప్ మోస్ట్ సెలబ్రిటీ హోదా కూడా పోయింది. అవినాష్, హరితేజ, మెహబూబ్, గంగవ్వ, రోహిణి ఆమె కంటే కూడా పాప్యులర్.  

Bigg boss telugu 8

ఇప్పటికే విష్ణుప్రియ టైటిల్ ఫేవరేట్ రేసు నుండి తప్పుకుంది. కనీసం ఫైనల్ కి వెళుతుందా అనేది కూడా అనుమానం. నామినేషన్స్ ఓటింగ్ లో మొదటి వారాల్లో ఆమె టాప్ లో ఉండేది. నబీల్, నిఖిల్ కూడా ఆమెను డామినేట్ చేస్తున్నారు. ఓటింగ్ లో వెనక్కి నెడుతున్నారు. ఈసారి లేడీ కంటెస్టెంట్ గా విష్ణుప్రియ టైటిల్ కొడుతుందని భావించిన వారికి నిరాశ తప్పేలా లేదు. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

Bigg boss telugu 8

మరోవైపు ఆరవ వారానికి విష్ణుప్రియ, సీత, పృథ్వి, యష్మి, గంగవ్వ, మెహబూబ్ నామినేట్ అయ్యారు. ఎర్లీ ఓటింగ్ ట్రెండ్ పరిశీలిస్తే... గంగవ్వ, మెహబూబ్ టాప్ లో ఉన్నారట. విష్ణుప్రియ మూడో స్థానంలో ఉందట. యష్మి  నాలుగు, సీత ఐదు, పృథ్వి ఆరవ స్థానాల్లో ఉన్నారట. సీత, పృథ్వి డేంజర్ జోన్లో ఉన్నట్లు మెజారిటీ పోల్స్ ఆధారంగా తెలుస్తోంది. 

Latest Videos

click me!