విష్ణుకి బాలయ్య ఫోన్.. నేనున్నా తమ్ముడు, ధైర్యంగా ముందుకెళ్లు.. వాళ్ళని చేతులు వాచేలా కొట్టాలి..

First Published Sep 27, 2021, 7:41 PM IST

అక్టోబర్ 10న జరగబోయే 'మా' ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్స్ మధ్య ప్రధాన పోటీ జరగనుంది. నేడు నామినేషన్స్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. 

అక్టోబర్ 10న జరగబోయే 'మా' ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్స్ మధ్య ప్రధాన పోటీ జరగనుంది. నేడు నామినేషన్స్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఓ వైపు థియేటర్స్ సమస్యపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.. మరోవైపు మా ఎన్నికలతో టాలీవుడ్ లో హడావిడి కనిపిస్తోంది. 

మా ఎన్నికలలో ప్రచార కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి. యువకుడిగా మంచు విష్ణు అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతుండడం ఆసక్తిగా మారింది. మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చివరి నిమిషం వరకు మా ఎన్నికలు ఏకగ్రీవం కావాలనే కోరుకున్నట్లు తెలిపాడు. చాలా మంది ప్రెస్ మీట్స్ పెట్టి తాము ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించుకున్నారు. కానీ నేను మీడియా ముందుకు రాలేదు. 

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి కలసి ఎన్నో చిత్రాల్లో నటించారు. ఇద్దరూ టాలీవుడ్ లో ఉన్నత స్థాయికి ఎదిగారు. కాయాన్ని వీరిద్దరి మధ్య అప్పుడప్పుడూ కొన్ని సంఘటనలు జరుగుతూ వచ్చాయి. వీరిద్దరి మధ్య జరిగిన సంఘటనలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.

ఎందుకంటే ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా చొరవతీసుకుని ఒక మంచి వ్యక్తిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారేమో అని ఎదురుచూశా. కానీ ఇక ఎన్నిక ఏకగ్రీవం కావట్లేదు అని గ్రహించాక తాను కూడా బరిలోకి దిగినట్లు మంచు విష్ణు తెలిపాడు. 

బాలకృష్ణ లాంటి వ్యక్తి ఎన్నికల నుంచి తప్పుకోమని అడిగితే తప్పుకుంటా. కానీ బాలకృష్ణ అంకుల్ నాకు ఫోన్ చేశారు. మంచి డెసిషన్ తీసుకున్నావు తమ్ముడు.. నేనున్నా.. ధైర్యంగా ముందుకెళ్లు అని చెప్పారు. 

Manchu Vishnu

ఇదిలా ఉండగా మెగా బ్రదర్ నాగబాబు గురించి కూడా విష్ణు మాట్లాడారు. నాగబాబు అంకుల్ ని నేను మా ఇంటి పెద్దగా భావిస్తాను. వాళ్ళందరి కళ్ళముందు పెరిగాను. కానీ ఆయన చేసిన కామెంట్స్ బాధించాయి. 

విష్ణు ట్వీట్ చేస్తూ.. ఢీ చిత్రం విడుదలై 13 ఏళ్ళు గడిచింది. 2007 ఏప్రిల్ 13న ఈ చిత్రం విడుదలయింది. ఈ చిత్రం విడుదలైనప్పుడు మా టీమ్ అందరి కళ్ళలో ఆనంద బాష్పాలు చూశాను. మా నాన్న మోహన్ బాబు గారు లేకుంటే ఈ చిత్రం ఎప్పటికీ విడుదలై ఉండేది కాదు.ఇదికల్ట్ యాక్షన్ కామెడీ చిత్రం. ఈ చిత్రాన్ని అన్నీ నా సోదరుడు శ్రీను వైట్లనే. ఢీ 2 ఎప్పుడు అంటూ విష్ణు శ్రీనువైట్లని ప్రశ్నించాడు.

కొంతమంది ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే హడావిడి చేశారు. వాళ్లలో ప్రస్తుతం మా అసోసియేషన్ లో పదవుల్లో ఉన్న వారు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరిని ఒక రూమ్ లో వేసి ఇండస్ట్రీ పెద్దలంతా చేతులు వాచిపోయేలా కొట్టాలి. మా అసోసియేషన్ లో ఉంటూ ఇలా చేయడం ఎథికల్ గా కరెక్ట్ కాదు అని మంచు విష్ణు హాట్ కామెంట్స్ చేశారు. 

click me!