మోక్షజ్ఞ మూవీతో బాలకృష్ణ చిన్నకూతురు టాలీవుడ్ ఎంట్రీ, ప్రకటనకు అందుకే ఆలస్యం!

First Published | Jul 12, 2024, 12:03 PM IST

బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్ధం. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని కూడా టాలీవుడ్ లో అడుగుపెడుతుందట. అధికారిక ప్రకటన ఆలస్యం చేయడం వెనుక కారణం ఉందట.. 
 


నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ అనివార్యమే అంటున్నారు. మోక్షజ్ఞను దర్శకుడు ప్రశాంత్ వర్మ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేయనున్నాడట. హనుమాన్ మూవీతో ప్రశాంత్ వర్మ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తనవైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు. ఈ క్రమంలో మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే బాధ్యత ప్రశాంత్ వర్మకు ఇచ్చాడట. 

Mokshagna


బాలకృష్ణ-ప్రశాంత్ వర్మ కలిసి మోక్షజ్ఞ కోసం మంచి కథ సిద్ధం చేశారట. ఆరంభంలోనే అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కాబట్టి... అన్ని విధాలా మోక్షజ్ఞకు సెట్ అయ్యే కథను ఎంచుకున్నారట. 


Mokshagna

ఇప్పటికే అధికారిక ప్రకటన జరగాల్సి ఉందట. అయితే ప్రస్తుతం  ఆషాడం నడుస్తుంది. ఆ వెంటనే మూఢం ఉంది. ఈ క్రమంలో వేచి చూస్తున్నారట. మూఢం ముగిసిన వెంటనే మోక్షజ్ఞ మూవీ పై ప్రకటన వస్తుందట. మరో ట్విస్ట్ ఏమిటంటే... ఈ చిత్రంతో బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని కూడా టాలీవుడ్ లో అడుగుపెట్టనుందట. అయితే నటిగా కాదు.


తేజస్వినికి చిత్ర పరిశ్రమ పట్ల ఆసక్తి ఉంది. ఆమె నిర్మాతగా రాణించాలి అనుకుంటున్నారు. మోక్షజ్ఞ చిత్రానికి ఆమె నిర్మాత అంటూ ప్రచారం జరుగుతుంది. గతంలో మోక్షజ్ఞ పెద్ద అక్క బ్రాహ్మణి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆమె కూడా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రొడ్యూసర్ గా ఉండాలని భావిస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఫైనల్ గా ఛాన్స్ తేజస్విని దక్కించుకుందని అంటున్నారు. 
 

ఇక మోక్షజ్ఞ మూవీ షూటింగ్ ఈ ఏడాదే మొదలు కానుంది. విడుదల మాత్రం 2025లో ఉంటుంది. మోక్షజ్ఞ మొదటి మూవీ ఏ జోనర్? కథ ఏంటి? అనే విషయాలపై ఇంకా సమాచారం లేదు. హీరోయిన్ మాత్రం శ్రీలీల అంటూ గట్టిగా ప్రచారం జరుగుతుంది. నందమూరి ఫ్యామిలీతో ఆమెకు ఉన్న అనుబంధం నేపథ్యంలో మోక్షజ్ఞ-శ్రీలీల  జంటగా నటిస్తారని టాలీవుడ్ టాక్. 
 

మోక్షజ్ఞ ఎంట్రీ చాలా ఆలస్యం అయ్యింది. ఆయన వయసు మూడు పదులకు దగ్గరైంది. ఒక దశలో మోక్షజ్ఞకు హీరో కావడం పై ఆసక్తి లేదంటూ ప్రచారం జరిగింది. ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ మోక్షజ్ఞ హీరో అవుతున్నాడు. మరి తండ్రి పేరు నిలబెట్టాల్సిన బాధ్యత మోక్షజ్ఞ మీద ఉంది. 
 

Latest Videos

click me!