తమ ఫ్యామిలీ కూడా కరోనా సోకిందని, దానితో యుద్దం చేసిందని చెబుతోంది అవికా గోర్. అది చాలా భయానక సంఘటన అని, దానికి తాను చాలా భయపడ్డానని తెలిపింది. ఈ మేరకు అవికా ఓ పెద్ద సందేశాన్ని పంచుకుంది.
`ఉయ్యాల జంపాల` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమై ఆకట్టుకున్న అవికా గోర్ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. బరువు తగ్గి స్లిమ్‌గా మారి సరికొత్తగా ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. వరుసగా తెలుగులో సినిమాలు చేస్తుంది.

28
ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో తాజాగా అవికా స్పందించింది. కరోనాతో తమ ఫ్యామిలీ కూడా పోరాడిందని చెప్పింది అవికా. ఇన్‌స్టాలో తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటూ ప్రజలకు, తన అభిమానులకు సందేశాన్నిచ్చింది.

38
`బయట పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం కరోనా వల్ల రెండు లక్షల మంది చనిపోయారు. కానీ అసలు సంఖ్య దానికంటే నాలుగైదు రెట్టు ఉంటుందని అంచనా. దాదాపు 17 మిలియన్ల ప్రజలు కరోనా బారిన పడ్డారు.

48
కరోనా బారిన పడ్డ వారిలో చాలా మంది భవిష్యత్తులోనూ అనారోగ్యంతో బాధపడే అవకాశం ఉంది. ఈ కరోనాను డీల్ చేయడం వైద్యారోగ్య విభాగానికి తలకు మించిన భారంగా మారింది. కాబట్టి ఈ వైరస్‌ను నియంత్రించేందుకు మనం చేయగలిగేదంతా చేద్దాం. సాధ్యమైనంత వరకు దాన్ని మరొకరికి సోకకుండా చూద్దాం.

58
నా కుటుంబం కూడా కరోనాతో యుద్ధమే చేసింది. నాక్కూడా చాలా భయమేసింది. కానీ ఈ పోరాటంలో వాళ్లు విజయం సాధించారు. కానీ ఎవరికీ ఇలాంటి పరిస్థితులు రావద్దు. కరోనాను జయించిన వాళ్లు దయచేసి ప్లాస్మాదానానికి ముందుకు రండి. అందరూ వ్యాక్సిన్ వేయించుకోండి. ఇది మిమ్మల్ని వైరస్ బారిన పడకుండా ఆపలేదు కావచ్చు, కానీ అది మీకు చేసే హానిని తగ్గిస్తుంది.

68
ఈ సందర్భంగా మీ అందరిని వేడుకుంటున్నా. అత్యవసరమైతేనే కాలు బయట పెట్టండి. లేదంటే ఇంట్లోనే ఉండండి. మనందరం ఏకమై దానితో పోరాడుదాం. ఇప్పటికే ఒకసారి జయించాం. మరోసారి గెలుస్తామన్న నమ్మకం కూడా ఉంది. నేను మీకు మాటిస్తున్నా.. కరోనా నుంచి విముక్తి కోసం నాకు చేతనైనంత కృషి చేస్తా` అని పేర్కొంది అవికా గోర్.

78
`చిన్నారి పెళ్లికూతురు`గా పాపులర్ అయిన అవికా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌గా మెప్పించింది. తెలుగులో `ఉయ్యాల జంపాల`, `లక్ష్మీ రావే మాఇంటికి`, `సినిమా చూపిస్తా మావ`, `మాంజా`, `ఎక్కడికి పోతావు చిన్నవాడా`, `రాజుగారి గది 3` చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు కళ్యాణ్ దేవ్‌తో ఓ సినిమా చేస్తుంది. అలాగే తన నిర్మాణంలో మరో సినిమా చేస్తుంది. దీనితోపాటు ఆది సాయికుమార్‌తో `అమరన్` అనే సినిమాలో నటిస్తుంది. ఇది ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే.

88
ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఆ మధ్య తన లవర్‌ని పరిచయం సైతం పరిచేసింది. మిలింద్ చంద్వానీతో ప్రేమలో ఉన్నానని, కానీ ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనని తెలిపింది.