మేకప్ లేకుండా షాకింగ్ లుక్ లో అనుపమ... వైరల్ అవుతున్న ఫోటోలు!

First Published | Dec 30, 2020, 3:42 PM IST

పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత అనుపమ పరమేశ్వరన్ కి చక్కగా సరిపోతుంది. యాక్టింగ్ లో సూపర్ టాలెంట్ ఉన్న ఈ అమ్మడు అద్భుతమైన పాత్రలు చేసి మైమరిపించారు. కాగా అనుపమ లేటెస్ట్ క్లిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మేకప్ లేకుండా ఆమె షాకింగ్ లుక్ లో కనిపించారు.

ఖాకీ కలర్ జీన్స్ జాకెట్ ధరించిన అనుపమ లేడీ బాస్ లుక్ లో కేకపుట్టించారు. మేకప్ లేకుండా అనుపమ నాచురల్ లుక్ ఆకట్టుకుంటుంది.
గ్లామర్ ఫీల్డ్ లోహీరోయిన్స్ ఎవరూ... మేకప్ లేకుండా కనిపించడానికి ఇష్టపడరు. అలా కనిపించడం కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని భయపడతారు.

ప్రతి విషయాన్ని భిన్న కోణంలో చూసే అనుపమ లైఫ్ స్టైల్ కూడా విభిన్నంగానే ఉంటుంది. ఇక న్యూ ఇయర్ సందర్భంగా అనుపమ ఆ ఫోటోలను షేర్ చేశారు. కొత్త ఏడాది ఆరంభం, గత ఏడాది అనుభవాల గురించి కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశారు.
మూడు ఫోటోలలోమూడు ఫీలింగ్స్ షేర్ చేసిన అనుపమ మొదట... అరే ఒక ఏడాది వేస్ట్ అయిపోయిందని బాధపడ్డారట. ఆ తరువాత 2020 మొత్తం కరోనానే... పోతే పోయిందిలే అని కన్విన్స్ అయ్యారట. ఇక మూడో సారి హమ్మయ్య ఆ కరోనా నాకు సోకలేదని ఆనంద పడ్డారట.
జీవితంలో నెగిటివ్ విషయాలను కూడా పాజిటివ్ గా ఎలా తీసుకోవాలో అనుపమ పరమేశ్వరన్ చక్కగా తెలియజేశారు.
దేనినైనా పాజిటివ్ గా తీసుకోవాలని అనుపమ తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో తెలియజేశారు.
2018 వరకు టాలీవుడ్ లో సూపర్ ఫార్మ్ కొనసాగించిన అనుపమ కొంచెం నెమ్మదించారు. 2019లో అనుపమ నటించిన రాక్షసుడు మాత్రమే విడుదల అయ్యింది.
ప్రస్తుతం తెలుగులో అనుపమ ఒక్క చిత్రంలో కూడా నటించడం లేదు. ఈ ఏడాది అనుపమ నటించిన ఒక మలయాళ చిత్రం విడుదలయ్యింది. అథర్వ హీరోగా తెరకెక్కుతున్న ఓ తమిళ చిత్రంలో అనుపమ హీరోయిన్ గా నటిస్తున్నారు.
మిడ్ నైట్ ఫ్రీడమ్అనే ఓ ఫీచర్ మూవీలో అనుపమ నటిస్తున్నారు. ఇది షార్ట్ ఫిల్మ్ అని సమాచారం. మరో వైపు అనుపమ డైరెక్టర్ గా మారే ఆలోచనలో ఉన్నారట. ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా డైరెక్షన్డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారని సమాచారం.

Latest Videos

click me!