కావ్య మారన్ని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో కావ్య మారన్ నుంచి అనిరుధ్‌కి ఎంత కట్నంగా వస్తుందనేది తెలిస్తే ఫ్యూజులు ఎగిలిపోవాల్సిందే. కొడితే గుంటనే కొడుతున్న అనిరుధ్.
సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ కూతురు, సర్‌రైజర్ క్రికెట్ టీమ్ ఓనర్ కావ్యమారన్.. త్వరలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌ని పెళ్లి చేసుకోబోతుంది. నవంబర్ 11న గ్రీస్‌లో వీరి మ్యారేజ్ ఉంటుందని సమాచారం. ఇటీవలే కళానిధి మారన్ దంపతులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పెళ్లి రిసెప్షన్‌కి ఆహ్వానించడం కోసమే సీఎంని కలిశారని తెలుస్తోంది. నవంబర్ 21న రిసెప్షన్ ఉంటుందని సమాచారం. అయితే వారి నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
24
ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న కావ్య, అనిరుధ్
ఇదిలా ఉంటే గత కొంత కాలంగా అనిరుధ్, కావ్య మారన్ ప్రేమలో ఉన్నారు. చాలా సార్లు కెమెరాలు చిక్కారు. ఈ ప్రేమ విషయాన్ని రహస్యంగానే మెయింటేన్ చేస్తున్నారు. ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఏకంగా పెళ్లితోనే క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట. ఈ క్రమంలో ఇప్పుడు ఎవరి ఆస్తులు ఎంత? కావ్యని పెళ్లి చేసుకుంటే అనిరుధ్‌కి ఎంత ఆస్తి వస్తుంది. కట్నంగా ఎంత ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే అనిరుధ్ కొడితే కుంభస్థలమే కొట్టబోతున్నాడట. వేల కోట్ల ఆస్తులను కొట్టేయబోతున్నాడట.
34
కావ్య, అనిరుధ్, కళానిధి మారన్ ఆస్తులు
అనిరుధ్ ఆస్తులు.. దాదాపు రూ.50-60కోట్లు ఉంటుందని సమాచారం. అనిరుధ్ ఒక్కో మూవీకి రూ.10-15కోట్లు పారితోషికంగా తీసుకుంటారు. ఇప్పుడు ఆయన ఆస్తి స్వయంగా ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాక సంపాదించినదే. ఇక కావ్య మారన్ ఆస్తులు దాదాపు రూ.500-600కోట్లు ఉంటాయట. ఇది ఆమె సొంతంగా ఉన్న ఆస్తులు. ఇక తండ్రి కళానిధి మారన్ వ్యాపారవేత్త, సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థకి హెడ్. అదే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ క్రికెట్ టీమ్‌కి ఓనర్ అనే విషయం తెలిసిందే. వీటితోపాటు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఆయన ఆస్తులు మొత్తంగా రూ.24,600కోట్లు ఉంటాయని సమాచారం.
కావ్యని పెళ్లి చేసుకోవడం వల్ల అనిరుధ్‌కి ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు కట్నంగా రాబోతున్నాయి. ప్రస్తుతానికి కొంత కట్నంగా ఇస్తారు. కానీ కళానిధి మారన్‌కి ఒక్కతే కూతురు. దీంతో ఆయన ఆస్తి మొత్తం కూతురుకే రాసిస్తాడు. ఫ్యూచర్లో ఆమెకే చెందుతుంది. దీంతో ఆ ఆస్తి మొత్తం అనిరుధ్, కావ్యలకే చెందుతుంది. ఇలా కావ్యని పెళ్లి చేసుకోవడం వల్ల దాదాపు రూ.25000కోట్లు సొంతం చేసుకోబోతున్నాడు అనిరుధ్. దీంతో ఈ మ్యూజిక్ కొడితే కుంభస్థలం కాదు, ఏకంగా గుట్టనే కొట్టబోతున్నాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అనిరుధ్ ఇటీవల రజనీకాంత్ `జైలర్ 2`కి మ్యూజిక్ అందించారు. సినిమాకి బీజీఎం ప్రాణం. మూవీ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది.