పెళ్లి రూమర్లపై స్పందించిన యాంకర్ శ్రీముఖి.. మ్యారేజ్ అప్పుడేనంట.. ఆ విషయంలో హర్ట్ అయిన రాములమ్మ!

Published : Jan 07, 2023, 05:52 PM ISTUpdated : Jan 07, 2023, 05:53 PM IST

స్టార్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi) పెళ్లిపై ఇటీవల కొన్ని వార్తలు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. వాటిపై తాజాగా స్పందించింది. మరీ ఇంత దారుణమా అంటూ.. ట్రోలర్స్ పై మండిపడింది. అలాగే తన పెళ్లిపైనా క్లారిటీ ఇచ్చేసింది.  

PREV
16
పెళ్లి రూమర్లపై స్పందించిన యాంకర్ శ్రీముఖి.. మ్యారేజ్ అప్పుడేనంట.. ఆ విషయంలో హర్ట్ అయిన రాములమ్మ!

బుల్లితెర రాములమ్మగా శ్రీముఖి టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కామెడీ షో ‘పటాస్’ మొదలు ఇప్పటికీ వరకు బ్యాక్ టు బ్యాక్ షోలతో అలరిస్తూ వస్తోంది. మరోవైపు నటిగానూ వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కేరీర్ దూసుకుపోతోంది. 
 

26

శ్రీముఖి సోషల్ మీడియాలోనూ నెటిజన్లు, తన అభిమానులతో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. లైవ్ సెషన్స్, చాట్ సెషన్స్ తో వారిని ఖుషీ చేస్తుంటుంది. తన పర్సనల్ లైఫ్ విషయాలనూ నిర్మోహమాటంగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. ఈ సందర్భంగా తన పెళ్లి ఎప్పుడంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.
 

36

ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్తతో శ్రీముఖి పెళ్లి జరగబోతుందని రూమర్లు పుట్టుకొచ్చాయి. గతంలోనూ ఇలాంటి వార్తలను యంగ్ యాంకర్ కొట్టిపారేసిన విషయం తెలిసిందే. ఇక తాజా రూమర్లపైనా ఘాటుగా స్పందించింది. పెళ్లి రూమర్లను ఖండించింది.

46

‘ఒకసారి బాయ్ ఫ్రెండ్ ఎవరంటూ.. మరోసారి పెళ్లి ఎప్పుడంటారు... ఇక తాజాగా మా నాన్న ఫొటోనే బ్లర్ చేసి పెళ్లి రూమర్లను పుట్టించడం దారుణమని మండిపడింది. ఈ వార్తలు వినివిని విసుగొస్తుంది. ఇక పెళ్లి విషయానికొస్తే మూడు, నాలుగేండ్ల తర్వాతే ఉంటుంది. అప్పుడు నేనే స్వయంగా ప్రకటిస్తాను’ అంటూ క్లారిటీ ఇచ్చింది. 
 

56

ఇప్పుడప్పుడే పెళ్లి ఆలోచన లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. మరోసారి క్లారిటీ ఇస్తూ రూమర్లకు చెక్ పెట్టింది. ప్రస్తుతం శ్రీముఖి టీవీషోలు, సినిమాలతో ఫుల్ బీజీగా ఉంది. కేరీర్ పైనే ఫోకస్ పెట్టింది. బ్యాక్ టు బ్యాక్ షోలతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు  చేస్తూ నెట్టింట దుమారం రేపుతోంది.
 

66

ఇక, శ్రీముఖి చేతిలో ప్రస్తుతం మూడు, నాలుగు షోలు ఉన్నాయి. ‘డాన్స్ ఐకాన్’,‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’,‘మిస్టర్ అండ్ మిసెస్’,‘సారంగ దరియా’కు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. నటిగానూ సినిమా అవకాశాలు అందుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’లో ముఖ్య పాత్రలో నటిస్తోంది.

click me!

Recommended Stories