ఆమె నా చేతి వంటతిని వెన్నుపోటు పొడిచింది.. నా భర్త అలాంటివారు కాదు, యాంకర్ శ్యామల ఎమోషనల్ కామెంట్స్

Published : May 17, 2023, 08:08 PM IST

టాలీవుడ్ అందమైన ఫిమేల్ యాంకర్స్ లో శ్యామల ఒకరు. అచ్చ తెలుగు వనితలాగా కనిపిస్తూ శ్యామల ఆకట్టుకుంటూ ఉంటుంది. శ్యామల యాంకరింగ్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తోంది.

PREV
16
ఆమె నా చేతి వంటతిని వెన్నుపోటు పొడిచింది.. నా భర్త అలాంటివారు కాదు, యాంకర్ శ్యామల ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ అందమైన ఫిమేల్ యాంకర్స్ లో శ్యామల ఒకరు. అచ్చ తెలుగు వనితలాగా కనిపిస్తూ శ్యామల ఆకట్టుకుంటూ ఉంటుంది. శ్యామల యాంకరింగ్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా మెరిసింది. 

26

అనసూయ, రష్మీ, శ్రీముఖి తరహాలో శ్యామల అతిగా గ్లామర్ ఎక్స్ పోజ్ చేయదు. నటుడు నరసింహారెడ్డిని శ్యామల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు సంతోషంగావైవాహిక జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. శ్యామల కెరీర్ ని, పర్సనల్ లైఫ్ ని బ్యాలన్స్ చేస్తూ వెళుతోంది. 

36

రీసెంట్ గా యాంకర్ శ్యామల బ్లాక్ బస్టర్ మూవీ విరూపాక్షలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. శ్యామల పాత్రకి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. రీసెంట్ గా శ్యామల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ లో, పర్సనల్ లైఫ్ లో ఎదురైన కష్టాలని గుర్తు చేసుకుంది. 

46

తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని బాధాకర విషయం నా పెళ్ళికి మా అమ్మ హాజరు కాకపోవడమే అని శ్యామల తెలిపింది. 19 ఏళ్లకే ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నా. నా పెళ్లి మా ఇంట్లో ఇష్టం లేదు. ఎలాగైనా మా అమ్మని ఒప్పించి పెళ్లి మండపానికి తీసుకుని వెళ్లి ఉంటె బావుండేది అనిపిస్తుంది. 

56

మాకు ఒక బాబు పుట్టాక రెండు ఫ్యామిలీలు కలసిపోయాయి. నేను 8 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు కూడా యాంకరింగ్ చేశాను. నాకు బాబు పుట్టాక కాస్త గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో బిగ్ బాస్ నుంచి పిలుపు వచ్చింది. దీనితో బిగ్ బాస్ షోకి హాజరయ్యాను. కానీ నన్ను అర్థం చేసుకోకుండా 11 నెలల బిడ్డని వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళింది అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. డబ్బుకోసం బిడ్డని కూడా వదిలేసింది అని నానా మాటలు అంటూ నిందలు వేశారు. 

66

కానీ నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ ఇవ్వడంతో మిగిలిన కామెంట్స్ పట్టించుకోవలసిన అవసరం రాలేదు. కానీ కోవిడ్ సమయంలో ఒకావిడ నా భర్తపై చీటింగ్ కేసు పెట్టడం ఎంతో బాధించింది. ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు నాచేత్తో వండి భోజనం పెట్టాను. అయినప్పటికీ మా ఫ్యామిలీ వెన్నుపోటు పొడిచి నిందలు వేసింది. నా భర్త ఒకరిని మోసం చేసే వ్యక్తి కాదు అని నాకు తెలుసు. చివరకి అదే రుజువైంది అని యాంకర్ శ్యామల ఎమోషనల్ కామెంట్స్ చేసింది.  

click me!

Recommended Stories