American Media about RRR: ఆర్ఆర్ఆర్ గురించి అమెరికన్ మీడియా కథనాలు, రాజమౌళి ఏమన్నారంటే...?

First Published | Apr 7, 2022, 3:35 PM IST

ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ హడావిడి మామూలుగా లేదు. మన దగ్గరే కాదు..ఓవర్ సిస్ లో కూడా ట్రిపుల్ ఆర్ దూసుకుపోతోంది. ముఖ్యంగా అమెరికన్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది సినిమా. 

టాలీవుడ్ జక్కన్న.. పాన్ ఇండియా దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం ట్రిపుల్ ఆర్. మార్చ్ 25న రిలీజ్ అయిన ఈ సినిమా.. పాన్ ఇండియా రేంజ్ లో  అద్భుతాలు సృష్టిస్తోంది. ఇటు మన తెలుగు రాష్ట్రాలు, దేశం దాటుకుని అమెరికాలో కూడా ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. 

అక్కడ మన ఇండియన్ ఆడియన్స్ తో పాటు.. అమెరికన్స్ కూడా ఈసినిమాను చాలా ఇంట్రెస్ట్ తో చూస్తున్నారట. ఇక ఈసినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు నార్త్ తో పాటు విదేశాలలో  సైతం మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాపై దేశీయ మీడియా మాత్రమే కాకుండా విదేశీ మీడియా కూడా ప్రశంసలు కురిపించింది. 
 


ఈ సినిమాగురించి ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ అద్భతమైన ఆర్టికల్ రాసిందట. విదేవీ మీడియాలో ట్రిపుల్ ఆర్  గురించి రీసెంట్ గా రాజమౌళి స్పందించారు.  విదేశీ మీడియా స్పందన గురించి రాజమౌళి మాట్లాడుతూ, అమెరికా కూడా ఈ సినిమాను ప్రశంసిస్తుందని ఊహించలేదని అన్నారు. న్యూయార్క్ టైమ్స్ తమ సినిమా గురించి రాసిందని... ఇది తనకు హార్ట్ టచింగ్ విషయమని అన్నారు. 
 

దీంతో తాము ఇంకా ఉత్సాహంగా ఉన్నామన్నారు జక్కన్న. అమెరికన్  ఆడియన్స్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాను ఆదరిస్తున్నారని జ క్కన్న ఎంతో సంతోషంతో చెపుతున్నారు. మరీ ముక్యంగా  గతంలో బాహుబలి సినిమాకు  జపాన్ ఆడియన్స్ నుంచీ  ప్రశంసలు వచ్చాయని,  ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కి యూఎస్ నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయని అన్నారు.  

ఏ సినిమాకైనా బాక్సాఫీస్ నంబర్లు చాలా ముఖ్యమైనవే అయినప్పటికీ... ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రశంసలు కూడా చాలా ముఖ్యమైనవని రాజమౌళి అన్నారు. అవి ట్రిపుల్ ఆర్ కు పుష్కలంగా వస్తున్నాయన్నారు జక్కన్న. టీమ్ అంతా ఈసినిమా సక్సెస్ పై దిల్ ఖుష్ గాఉన్నారు. 

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటించారు.చరణ్ జోడీగా సీతపాత్రలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటించగా.. హాలీవుడ్ బ్యూటీ ఓలీవియో కూడా ఈ మూవీలో మరో హీరోయిన్ గా నటించింది. 
 

మార్చ్ 25న రిలీజ్ అయిన ఈ సినిమా  బాక్సాఫీస్ ను దడదడలాడిస్తుంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ..1000కోట్లకు చేరువలో ఉంది. ఇండియాలోని అన్ని భాషల్లో ట్రిపుల్ ఆర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా హిందీ మర్కెట్ లో దూసుకుపోతోంది. విమర్షకుల ప్రశంసలుపొందిందీ మూవీ. 
 

Latest Videos

click me!