Alia Bhatt At Airport : పెళ్లి తర్వాత మొదటిసారి కనిపించిన అలియా భట్.. ముంబై ఎయిర్ పోర్టులో సందడి..

Published : Apr 19, 2022, 03:30 PM IST

బాలీవుడ్  స్టార్స్ అలియా భట్ (Alia Bhatt), రన్బీర్ కపూర్ (Ranbir Kapoor) ఎట్టకేళలకు ఒక్కటయ్యారు. వెడ్డింగ్ తర్వాత అలియా మొదటిసారిగా ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. ఈ సందర్భంగా అక్కడ సందడి నెలకొంది.  

PREV
16
Alia Bhatt At Airport : పెళ్లి తర్వాత మొదటిసారి కనిపించిన అలియా భట్..  ముంబై ఎయిర్ పోర్టులో సందడి..

ఐదేళ్లపాటు డేటింగ్ చేసిన తర్వాత ఏప్రిల్ 14న ముంబైలో పెళ్లి చేసుకున్నారు. వివాహానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ, కరీనా కపూర్, కరిష్మా కపూర్ మరియు ఇతరులు అలియా మరియు రణబీర్ ప్రీ వెడ్డింగ్ మరియు వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యారు.
 

26

ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్న అలియా భట్ ముంబైలోని కలీనా విమానాశ్రయంలో ఈ రోజు దర్శనమిచ్చింది. రన్బీర్ కపూర్‌తో వివాహం తర్వాత అలియా బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి. అలియా ఒక్కసారిగా కనిపించడంతో అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు.
 

36

పింక్ డ్రెస్ లో అలియా భట్ చాలా అందంగా కనిపిస్తోంది. తన హ్యాండ్‌బ్యాగ్ మరియు మినిమల్ జ్యువెలరీతో ఈ కొత్త పెళ్లి కూతురు మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో నవ్వుతూ కెమెరాలకు హాయ్ చెప్పింది.
 

46

ఇక పెళ్లి సందడి ముగియడంతో రన్బీర్ కపూర్ నిన్న తన వర్క్ ను  పునఃప్రారంభించాడు. తాజాగా ఈ రోజు అలియా భట్ బ్యాక్ టు  వర్క్ చెప్పింది. ఇందుకు ముంబైలోని కలీనా విమానాశ్రయానికి చేరుకుంది. బాలీవుడ్  స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ (Ranveer Singh)తో కలిసి కరణ్ జోహార్ ‘రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’లో అలియా నటిస్తోంది. 
 

56

దర్శకుడు అయాన్ ముఖర్జీ  తెరకెక్కిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’(Brahmastra) సినిమాతో అలియా భట్ మరియు రన్బీర్ కపూర్ తొలిసారిగా స్క్రీన్ పై కలిసి నటించనున్నారు. తెలుగులో ఇటీవల ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రంలో నటించి తెలుగు ఆడియెన్స్ ను అలరించింది. 

66

అయితే, పెళ్లికి ముందు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రన్బీర్, అలియా అభిమానులు ఎంతగానో అసహనం వ్యక్తం చేశారు. కానీ పెళ్లి తర్వాత, అలియా భట్ తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను పంచుకుంది. ‘ఈ రోజు మా కుటుంబం, స్నేహితుల మధ్య 5 ఏండ్లుగా గడిపిన నివాసంలో పెళ్లి చేసుకున్నాం.’ అని తెలిపింది.  
 

click me!

Recommended Stories