ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా, బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్‌గా రాణించిన ఓ హీరోయిన్‌ని పట్టుకొని ఏఎన్నార్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడట. దీంతో ఆమె చేసిన పనికి అక్కినేని షాక్ అయ్యాడట.
ఏఎన్నార్.. మంచి రొమాంటిక్ చిత్రాలతో ఆకట్టుకున్నారు. `దేవదాసు` వంటి అనేక ప్రేమ కథా చిత్రాలతో అలరించారు. మోస్ట్ రొమాంటిక్ హీరోగానూ పేరుతెచ్చుకున్నారు. అయితే మన్మథుడు అంటే నాగార్జున పేరే చెబుతారు. కానీ అసలైన మన్మథుడు తాతగారు అని హీరో సుమంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. చాలా మంది హీరోయిన్లు కూడా ఏఎన్నార్ గురించి ఇదే చెప్పారు, ఆయన బోల్డ్ గా ఉంటారని, హీరోయిన్లని ఆటపట్టిస్తుంటాడని, సరదాగా సరసం ఆడుతుంటాడని పలువురు సీనియర్ హీరోయిన్లు తెలిపారు. ఆయన ఏజ్ 60 అయినా ఇరవై లాగే మనసు ఉంటుందన్నారు.
25
హీరోయిన్‌ని పట్టుకొని తిట్టిన అక్కినేని
ఈ క్రమంలో ఓ స్టార్ హీరోయిన్‌ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడట ఏఎన్నార్. హీరోయిన్ కావాలని వస్తే, ఒక రేంజ్ లో ఆడుకున్నాడట. దెబ్బకి ఆమె ఏడుస్తూ వెళ్లిపోయిందట. పోతూ పోతూ ఏఎన్నార్ కార్ డోర్‌ని తన్ని వెళ్లిపోయిందట. ఇది చూసిన అక్కినేని షాక్ అయ్యాడట. మరి ఆ కథేంటి? ఆ హీరోయిన్ ఎవరనేది చూస్తే, ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించింది క్రిష్ణవేణి. 1979లో `నగ్న సత్యం` అనే చిత్రంతో ఆమె హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్‌లో హీరోయిన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. ప్రారంభంలో హీరోయిన్‌గా చేసి మెప్పించింది. స్టార్‌గా రాణించింది.
35
అక్కినేనిని చూసి అరిచిన కృష్ణవేణి
సినిమాల్లోకి వచ్చిన ప్రారంభంలో కృష్ణవేణి మొదటి సినిమా చేసింది. ఆ తర్వాత అవకాశాల కోసం చూస్తున్నప్పుడు. ఏఎన్నార్ కొత్తగా ఒక సినిమా చేస్తున్నాడట. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుందట. వెళ్లి కలిసి రా అని చెప్పి కృష్ణవేణికి కారు ఇచ్చి పంపించాడట వాళ్ల మామయ్య. ఆయన ఏఎన్నార్‌కి చాలా క్లోజ్. దీంతో కారులో స్టూడియోకి వెళ్తున్నప్పుడు అప్పుడే అక్కినేని ఓపెన్ టాప్ కారులో ఇంటికెళ్తుందట. ఆయన్ని చూసి, ఇదిగో మా మామయ్య మిమ్మల్ని ఒకసారి కలిసి రమ్మన్నారని గట్టిగా అరిచిందట. అది విన్న ఏఎన్నార్.. ఒక్క చూపు చూసి సరే రా అన్నాడట.
ఆమెని తన కారులో ఎక్కించుకొని ఇంటి వరకు తీసుకెళ్లాడట. వెనకాల కృష్ణవేణి వాళ్ల కారు వస్తుంది. ఇంటికెళ్లే లోపు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడట అక్కినేని. కమ్మకులంలో పుట్టి సిగ్గులేదా, అమ్మకి బాబుకి చెప్పి వచ్చావా? పారిపోయి వచ్చావా? సినిమాల్లోకి రావాలని నీకు ఎలా అనిపించింది? అంటూ గ్యాప్ లేకుండా తిడుతూనే ఉన్నాడట. దాన్ని కృష్ణవేణి తట్టుకోలేకపోయిందట. ఇక అక్కినేని ఇళ్లు వచ్చింది. రాగానే.. ఇక దిగు నిన్ను ఇలా చూస్తే, మా ఆవిడ నాకు తిండి కూడా పెట్టదు అన్నాడట. ఆ దెబ్బకి కారు దిగిన కృష్ణవేణి.. అక్కినేని కారు డోర్‌ని ఒక్క తన్ను తన్ని వెళ్లి తన కారులో కూర్చుందట. ఆమె ఇంటికి వెళ్లే లోపు.. అక్కినేని వాళ్ల మామయ్యకి ఫోన్ చేసి కృష్ణవేణి ప్రవర్తన గురించి చెప్పాడట. బాగా తిట్టాడట. అక్కినేనికి మాటల్లో ప్రేమ అలా వస్తుందని, మనసులో ఆయనకు ఏం ఉండదని తెలిపింది కృష్ణవేణి.
55
నిన్ను ఎవడూ పెంచుకోడు, ఉంచుకుంటాడు
అప్పట్లో కృష్ణవేణికి ఏఎన్నార్ అంటే చాలా ఇష్టమట. ఆయన సినిమా షూటింగ్‌లకు కచ్చితంగా వెళ్లేదట. ఓ సారి ఏఎన్నార్ మూవీ ఓపెనింగ్ కి వెళ్తే.. ఆమెని చూసి పక్కన కూర్చోబెట్టుకున్నాడట. ఏంటి ఎలా ఉన్నావ్ అని అడిగితే, బిజీగా ఉన్నాను, సినిమాలు చేసి విసుగు వస్తుంది, ఎవరైన పెంచుకుంటే బాగుండు వెళ్లిపోతా అన్నదట కృష్ణవేణి. ఇది విన్న ఏఎన్నార్.. నిన్నెవరు పెంచుకుంటాడు, ఉంచుకుంటారుగానీ అన్నాడట. దెబ్బకి మైండ్ బ్లాక్ అయ్యిందట. ఏంటండి అలా అంటున్నారని అడిగితే, మరేంటి.. మంచిగా సినిమాలు వస్తున్నాయి, బిజీగా ఉన్నావు, సినిమాలు చేసుకోకా, వెళ్లిపోతానేంటి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట. ఇలా ఆయన మాటల్లో ప్రేమే ఉంటుందని ఆమె వెల్లడించింది. సుమన్ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకుంది సీనియర్ నటి కృష్ణవేణి.