అభిమానుల కోసం... (అజిత్ 'విశ్వాసం' రివ్యూ )

First Published Mar 2, 2019, 9:41 AM IST

అజిత్ సినిమాలంటే ఓ జనరేష్ మొత్తానికి  ప్రేమ లేఖ సినిమా గుర్తు వస్తుంది. ఆ తర్వాత ఎన్ని డబ్బింగ్ సినిమాలు వచ్చినా అంతంతమాత్రంగానే ఆడాయి. అయినా అజిత్ తెలుగు తెరను విడిచిపెట్టడం మానలేదు.

(------Review By సూర్య ప్రకాష్ జోస్యుల) అజిత్ సినిమాలంటే ఓ జనరేష్ మొత్తానికి ప్రేమ లేఖ సినిమా గుర్తు వస్తుంది. ఆ తర్వాత ఎన్ని డబ్బింగ్ సినిమాలు వచ్చినా అంతంతమాత్రంగానే ఆడాయి. అయినా అజిత్ తెలుగు తెరను విడిచిపెట్టడం మానలేదు. తమిళ సూపర్ హిట్స్ ని ఇక్కడ డబ్ చేసి వదలటం కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా దర్శకుడు శివతో ఆయన కంటిన్యూగా చేస్తున్న మాస్ సినిమాలు అక్కడ సూపర్ హిట్ అవుతూండటంతో...ఇక్కడా మనవాళ్లకు నచ్చుతాయని రిలీజ్ చేస్తున్నారు. అయితే అవి మన పాత తెలుగు హిట్ సినిమాలకు నకలలుగా ఉండటంతో పెద్దగా ఫలితం కనపడటం లేదు. తాజాగా మరోసారి తమిళ సంక్రాంతికి సూపర్ హిట్ గా నిలిచిన 'విశ్వాసం' ని తెలుగు డబ్ చేసి వదిలారు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో అందులో సగమైనా సక్సెస్ అవుతుందా..లేక రెగ్యులర్ గా అజిత్ తెలుగు సినిమాలు వెల్తున్న దారిలోనే వెల్తుందా..రివ్యూలో చూద్దాం.
undefined
కథేంటి: రావులపాలెం లో ఉండే వీర్రాజు (అజిత్)ఆ ప్రాంతంలో పెద రాయుడు టైప్. ఆయన్ను అందరూ గౌరవిస్తారు. వీర్రాజు కూడా అంతే ప్రేమగా వారిని చూసుకుంటూంటాడు. ఆ ఊళ్లో దాదాపు పదేళ్ల తర్వాత జాతర చేద్దామని ఏర్పాటు చేద్దామని ఏర్పాటు చేస్తూంటాడు. ఆ జాతర కోసం ఎక్కడెక్కడ జనం ఆ ఊళ్లకు వస్తారు. వాళ్లంతా మంచి హ్యాపీ మూడ్ లో తమ కుటుంబాలతో గడుపుతూంటాడు. వీర్రాజు మాత్రం ఒంటిరి. అతను తన భార్య నిరంజన (నయనతార) తన దగ్గర లేదని బాధపడతాడు. పైకి నవ్వుతూ ఉన్న లోపల ఆవేదనతో ఉండటం గమనించిన అతని బంధువులు,సన్నిహితులు ముంబయిలో ఉన్న భార్య నిరంజన, కూతురు శ్వేతలను ఊరికి తీసుకురమ్మని ఫోర్స్ చేస్తారు. భార్య తిరిగి ఆ ఊరు రావటానికి ఒప్పుకోదు. అదే సమంయలో వీర్రాజు కూతురిని గుర్తు తెలియని వ్యక్తులు చంపటానికి ట్రై చేస్తారు. వాళ్లు ఎవరు? వీర్రాజు కూతురుని ఎందుకు చంపాలనుకుంటున్నారు? అసలు వీర్రాజు భార్య అతని వదిలేసి వెళ్లడానికి కారణం ఏంటి? చివరకు కుటుంబం మొత్తం ఒకటైందా వంటి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
undefined
మొదటి నుంచీ మాస్ మంత్రం: సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ కార్డ్ పడేదాకా ఒకటే దర్శకుడు లక్ష్యం. అదేమిటంటే అజిత్ లో ఉన్న మాస్ అప్పీల్ ని ఎలివేట్ చేయటం. అందుకోసమే చాలా సీన్లు అవసరం ఉన్నా లేకపోయినా వస్తూంటాయి. అజిత్ వీరాభిమానులుకు ముఖ్యంగా తమిళం వాళ్లకు ఆ సీన్స్ సూపర్ అనిపించవచ్చేమో కానీ మనకు కాస్త ఇబ్బందిగానే అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే ఒకటే ఫార్మెట్..ఫస్టాఫ్ కామెడీ (అది నవ్వు రాదు) తో నింపేయటం..సెకండాఫ్ లో ఎమోషన్ సీన్స్ తో ఫ్యామిలీలను టార్గెట్ చేయటం. అందుకోసం సీన్స్ ని సాగ తీసేసారు. కూరుతు, భార్యతో వచ్చే సీన్స్ తో ఎడాపెడా సెకండాఫ్ ని నింపేసారు. కామెడీ అయితే ఎనభైల నాట జోక్ లను ప్లే చేసారు. ఎంత మాస్ కోసమైనా మరీ అంత మోటుగా కామెడీ చెయ్యాల్సిన పనిలేదేమో.
undefined
ఇక విలన్ జగపతి బాబు ఉన్నాడు అంటే ఉన్నాడు...అంతేతప్ప అతని వల్ల ఒరిగిందేమీ లేదు. అయితే అజిత్ మాత్రం చాలా సెటిల్డ్ ఫెరఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు. ఆయనే సినిమాని ఒంటి చేత్తో లాక్కెళ్లిపోయారు. అలా అనిపించాలనే దర్శకుడు ఉద్దేశ్యం కూడా అనుకుంటాను..అదే యాంగిల్ లో కృషి చేసాడు. నయనతార గురించి కొత్తగా చెప్పేదేముంది. ఇలాంటి క్యారక్టర్స్ కొట్టినపిండి. గతంలో వెంకటేష్ తులసి సినిమాలో ఆమె చేసింది ఇలాంటి పాత్రనే కదా. ఇంత చెప్పుకున్నాక బేబి అనిక గురించి మాట్లాడకోకపోతే ఈ రివ్యూ వృధానే. పెద్ద పెద్ద డైలాగ్స్ లేకుండానే చక్కటి నటనతో ఎమోషన్స్ ని పండించింది. అజిత్ , నయనతార వంటి స్టార్స్ తో పోటీ పడి..ఎక్కడా తేలిపోకుండా తన పాత్రను హైలెట్ అయ్యేలా చేసింది.
undefined
మిస్సైంది అదే: దర్శకుడు శివ.. తన కథలకు.... రొట్ట కొట్టడు కాన్సెప్ట్ లు తీసుకోకపోతే మంచి కథలు వస్తాయి. అప్పుడు తను చూపే మాస్ ఎలిమెంట్స్ మరింతగా పండుతాయి. సినిమాలు అజిత్ వీరాభిమానులు భుజాన మోయచ్చేమో కానీ ..కామన్ ఆడియన్ కు కనెక్ట్ కావాలి కదా..అందుకు సీన్స్ లో కాస్తంత లాజిక్..కామన్ సెన్స్ అవసరం. సినిమాలో నయనతార...రైస్ మిల్ లో మెడికల్ క్యాంప్ రన్ చేస్తుంది. డైరక్టర్ గా అది మాస్ అప్పీల్ కోసం పెట్టి ఉండవచ్చు ..కానీ ఎవరు అలాంటి వాతావరణంలో మెడికల్ క్యాంప్ రన్ చేయరు కదా. అలాంటి సీన్స్ చూస్తూంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది.
undefined
టెక్నికల్ గా: స్వతహాగా దర్శకుడు శివ ..సినిమాటోగ్రాఫర్ కావటం, వెట్రి వంటి టాప్ టెక్నీషియన్ ని ఆ విభాగానికి ఎంచుకోవటంతో అవుట్ ఫుట్ అదిరిపోయింది. అలాగే మాస్ సీన్స్ హైలెట్ చేయటానికి డి ఇమ్మాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా కలిసొచ్చింది. బెన్ ఎడిటింగ్ ఇంకొన్ని సీన్స్ ని లేపేస్టే...టైట్ గా ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేదనిపించింది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. దర్శకుడుగా శివ..అజిత్ కు పర్శనల్ డైరక్టర్ ...ఆయన బలాలు, బలహీనతలు బాగా తెలుసనే విషయంలో చాలా సీన్స్ లో మనకు కనపడతూంటుంది. అదే ప్లస్..అదే మైనస్ కూడా.
undefined
ఫైనల్ థాట్: తమిళ డబ్బింగ్ సినిమా వస్తోందంటే ఒకప్పుడు ఏదో వెరైటీ ఉంటుందని ఆశించే వాళ్లం. ఇలాంటి సినిమాలు మనలో ఆ భ్రమను పోగొట్టేందుకు కృషి చేస్తున్నాయి. Rating: 25
undefined
click me!