ఆదాశర్మ `సీడీ`, సన్నీ `సౌండ్‌ పార్టీ`, `సగిలేటి కథ`కై వర్మ, `ఏందిరా ఈ పంచాయితీ` ఫస్ట్ లుక్‌..ఫ్రైడే అప్‌డేట్స్

Published : Aug 18, 2023, 11:54 PM IST

ఆదాశర్మ  నటించిన `సీడీ`, నూతన చిత్రం `ఏందిరా ఈ పంచాయితీ` చిత్రాల ఫస్ట్ లు, సన్నీ నటించిన `సౌండ్‌ పార్టీ`కోసం సంపత్‌ నంది రావడం, `సగిలేటి కథ`కై వర్మ సపోర్ట్ చేయడం, భీమదేవరపల్లి బ్రాంచి ఓటీటీలో రావడం ఈ  శుక్రవారం అప్‌డేట్లు.

PREV
15
ఆదాశర్మ `సీడీ`, సన్నీ `సౌండ్‌ పార్టీ`, `సగిలేటి కథ`కై వర్మ, `ఏందిరా ఈ పంచాయితీ` ఫస్ట్ లుక్‌..ఫ్రైడే అప్‌డేట్స్

ఆది శర్మ `సీ.డీ` ఫస్ట్ లుక్‌..

`ది కేరళా ఫైల్స్`తో పాపులర్‌ అయిన ఆదాశర్మ ఇప్పుడు `సీ.డీ` అనే చిత్రంలో నటిస్తుంది. సరికొత్త సైకలాజికల్‌ హర్రర్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతుంది. కృష్ణ అన్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని SSCM ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండగా గిరిధర్ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. RR ధృవన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అదా శర్మ సీరియస్ లుక్‌, ఆ చుట్టూ డెవిల్స్ హ్యాండ్స్ కనిపిస్తుండటం చిత్రంలోని వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. C.D అనే టైటిల్ క్రిమినల్ ఆర్ డెవిల్ అనే ట్యాగ్ లైన్‌తో పోస్టర్ చూడగానే సినిమాపై ఆసక్తి నెలకొనేలా ఈ ఫస్ట్ లుక్ డిజైన్ చేశారు. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడంలో కొత్త దారిలో వెళుతున్నాం అని పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఇందులో విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 
 

25

ఆర్జీవీ ఆవిష్కరించిన'సగిలేటి కథ' నుంచి 'ఏదో జరిగే' సాంగ్.....

హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంట గా నటిస్తున్న చిత్రం 'సగిలేటి కథ'. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి 'రాజశేఖర్ సుద్మూన్' రచన, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్ లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా కలిసి నిర్మించారు. ఈ సినిమాలోని  'ఏదో జరిగే' వీడియో సాంగ్ ని ఆర్జీవీ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ: `సగిలేటి కథ` సినిమా ట్రైలర్ చూసాక నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఈ సినిమా ఇంత ఘన విజయంగా కంప్లీట్ చేసి ముందుకి తీసుకెళ్తున్న డైరెక్టర్ 'రాజశేఖర్ సుద్మూన్'కి, బ్యూటిఫుల్ గా పాడి అందరిని కవ్వించిన కీర్తన శేష్ కి నా ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది` అని అన్నారు. 

డైరెక్టర్ రాజశేఖర్ సుద్మూన్ మాట్లాడుతూ: మా సినిమా సాంగ్ ని ఆర్జీవీ గారు చేతుల మీదగా చేయడం వళ్ళ మాకు ఎంతో ఎనర్జీ వచ్చింది. నేను ఆయనికి ఎంతో రుణపడి ఉంటాను. అలాగే, మా సినిమా నీ ప్రెసెంట్ చేస్తున్న హీరో నవదీప్ ఎంత చెప్పినా తక్కువే` అన్నారు. హీరో 'రవి మహాదాస్యం' మాట్లాడుతూ: `సగిలేటి కథ`  ఒక బ్యూటిఫుల్ అండ్ మ్యూజికల్ మూవీ. ఈ సినిమాలో ప్రతి సాంగ్ బాగుంటుంది. ముఖ్యంగా, ఏదో జరిగే పాట హాయిగా పాడుతూ నిద్రలోకి జారుకోవచ్చు. కాంటెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది` అని తెలిపారు.
 

35

సన్నీ `సౌండ్‌ పార్టీ`కి సంపత్‌ నంది సపోర్ట్..
 
బిగ్ బాస్ తెలుగు 5 టైటిల్ విన్న‌ర్ వీజే స‌న్నీ హీరోగా  ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై, ప్రొడక్షన్ నెంబ‌ర్-1గా రూపొందుతోన్న చిత్రం `సౌండ్ పార్టీ.  హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్.  రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర  నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పణ.  సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడు.  ఈ చిత్రం  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్  కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని సెప్టెంబ‌ర్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. గెస్ట్ గా వచ్చిన దర్శకుడు సంపత్‌ నంది టీజర్‌ని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ, నేను కూడా గ‌తంలో కొన్ని చిత్రాల‌కు స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హ‌రించాను. అదే బాట‌లో జ‌య‌శంక‌ర్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హరిస్తున్నాడు.   `సౌండ్ పార్టీ` టీజ‌ర్ బావుంది. అలాగే మోహిత్ చేసిన మ్యూజిక్ కూడా చాలా బావుంది. ఈ చిత్రం మ‌రో `జాతిర‌త్నాలు` సినిమాలా ఉండ‌బోతున్న‌ట్లు టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. వీజే స‌న్నికి ఇది మంచి సినిమా అవుతుంది` అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో సన్నీ, నిర్మాత రవి పోలిశెట్టి, సమర్పకుడు జయశంకర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ మోహిత్‌ రెహ మానిక్‌, దర్శకుడు సంజయ్‌ శౌరి, ఇతర చిత్ర బృందం పాల్గొని తన అనుభవాలను షేర్‌ చేసుకున్నారు.
 

45

'ఏందిరా ఈ పంచాయితీ' ఫస్ట్ లుక్ రిలీజ్

డిఫరెంట్ కంటెంట్, అంతకుమించి డిఫరెంట్ గా టైటిల్ ఇదే ఈ తరం ప్రేక్షకలోకం మెచ్చే సినిమా. నేటితరం ప్రేక్షకుల టేస్ట్‌కి అనుగుణంగా వీటన్నింటినీ కలగలుపుతూ తీసిన సినిమానే 'ఏందిరా ఈ పంచాయితీ'. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్నారు. గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో  హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. రీసెంట్‌గా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టైటిల్ లోగో అందరినీ ఆకట్టుకుంది. ఊర్లోని వాతావరణాన్ని, చిన్న గొడవలు, కులవృత్తులను తెలియజేసేలా కొన్ని సంకేతాలను వదిలారు. ఇలా టైటిల్ పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచిన మేకర్స్ తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఎట్రాక్ట్ చేశారు. 

ఈ పోస్టర్ చూస్తుంటే 'ఏందిరా ఈ పంచాయితీ' రూపంలో ఓ కంప్లీట్ విలేజ్ స్టోరీని తెరపైకి తీసుకొచ్చారని తెలుస్తోంది. ఊరి చివర సహజమైన వాతావరణంలో హీరో హీరోయిన్ ఓ గోడ మీద కూర్చొని ముచ్చటించుకుంటున్న సీన్ ఫస్ట్ లుక్‌గా వదిలారు. ఈ పోస్టర్ చూస్తుంటే హీరో హీరోయిన్ గాఢమైన ప్రేమలో అస్సలు సంబంధం లేని ఎన్నో పంచాయితీలు చోటు చేసుకుంటాయని.. ఈ పంచాయితీల చుట్టే ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఏదిఏమైనా పూర్తి పల్లెటూరు నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఒక మంచి ఫీల్ తెప్పిస్తుందని మాత్రం అర్థమవుతోంది.   
 
 

55

అమెజాన్ ప్రైమ్ లో `భీమదేవరపల్లి బ్రాంచి`..

రమేష్ చెప్పాల దర్శకత్వంలో తెలంగాణ గ్రామీణ నేపధ్యంలో రూపొందిన `భీమదేవరపల్లి బ్రాంచి` ఇటీవల మైత్రి మూవీస్ ద్వారా విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నేటివిటీ  సినిమాల్ని ఇష్టపడుతున్న  నేటి ప్రేక్షకులకి `భీమదేవరపల్లి బ్రాంచి` పల్లె ప్రజల జీవన విధానాన్ని అమాయకత్వాన్ని, సంస్కృతిని సంఘర్షణని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. సినిమాలో రాజకీయ నాయకుల తప్పుడు వాగ్దానాలు నమ్మి ప్రజలు ఎలా అవస్థలు పడతారో దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఉచిత పథకాల మీద దర్శకుడు తన మాటలతో వ్యంగ్య హస్త్రాల సంధించాడు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories