పట్టుచీర, ఆభరణాల్లో దగదగ మెరిసిపోతున్న శ్రీలీలా.. షోరూమ్ ఓపెనింగ్ లో యంగ్ బ్యూటీ సందడి..

First Published | Apr 16, 2023, 7:48 PM IST

టాలీవుడ్ యంగ్ హీరోయిన్  శ్రీలీలా వరుస చిత్రాలతో అలరిస్తూనే వస్తోంది. మరోవైపు ఆయా  షోరూమ్ లను తనచేతుల మీదుగా ప్రారంభిస్తూ సందడి చేస్తోంది. తాజాగా పట్టుచీరలో తళుక్కున మెరిసింది. 

యంగ్ హీరోయిన్  శ్రీలీలా (Sreeleela) పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుమోగుతోంది. స్టార్ హీరోల సరసన.. భారీ ప్రాజెక్ట్స్ లలో అవకాశాలు దక్కించుకుంటున్న యంగ్ బ్యూటీ రోజుకు తన క్రేజ్ దక్కించుకుంది. అయితే శ్రీలీలకు ఉన్న క్రేజ్ కు సినిమా ఆఫర్తు వస్తూనే ఉన్న విషయం తెలిసిందే.  
 

మరోవైపు ఆయా బ్రాండ్స్ ను కూడా ప్రమోట్ చేస్తుంది. యంగ్ బ్యూటీ  క్రేజ్ ను పలు సంస్థలు వినియోగించుకుంటున్నారు. శ్రీలీలా చేత తమ షోరూమ్ లను ప్రారంభించుకుంటున్నారు. తాజాగా CMR  సంస్థ జూయెల్లరీకి సంబంధించిన కొత్త షోరూమ్ ఓపెనింగ్ కు శ్రీలీలా సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. కుందనపు బొమ్మలా ఆకట్టుకున్నారు. 
 


ప్రముఖ సీఎంఆర్ సంస్థ తన 12వ జ్యూయెల్లరీ షోరూంను ఈరోజు ఏఎస్ రావు నగర్ లో గ్రాండ్ గా ఓపెన్ చేశారు. ఈవెంట్ కు యంగ్ హీరోయిన్ శ్రీలీలా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాలుగు అంతస్థులు గల స్వర్ణాభరణాల మెగా షోరూమ్ ను సీఎంఆర్ లెగ‌సీ ఆఫ్ జ్యూయలరీ పేరుతో శ్రీలీలా  చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి నయా షోరూమ్ ను ప్రారంభించారు. 
 

ఈ కార్యక్రమంలో బేతి సుభాష్ రెడ్డి (ఎంఎల్), సింగిరెడ్డి శిరీష సోమశేఖ‌ర్ రెడ్డి, ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరిగింది. ఇక అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల మజూరిపై 50% వరకు తగ్గింపు, వజ్రాభరణాలపై క్యారట్ కు రూ. 20,000 తగ్గింపు.. ఇలా తదితర ఆఫర్లను అందిస్తున్నారు. సుమారు 130 మంది షోరూమ్ లో ఉపాధి పొందారని సంస్థ అధినేత శ్రీ అల్లక‌ సత్యనారాయణ తెలిపారు. 
 

ఇదిలా ఉంటే శ్రీలీలా సంప్రదాయ దుస్తుల్లో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎర్రటి పట్టుచీరలో ఖరీదైన నగలను ఒంటినిండా నింపుకొని దగదగ మెరిసిపోతోంది. వజ్రంలా అందాల కాంతులను వెదజల్లుతూ  ఫ్యాన్స్ ను,  షోరూమ్ కు హాజరైన వారిని కట్టిపడేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

కేరీర్ విషయానికొస్తే.. శ్రీలీలా టాలీవుడ్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ చేతిలో ఏకంగా ఎనిమిది ప్రాజెక్ట్ ఉన్నాయి. అన్నీ సెట్స్ పైనే ఉండటం విశేషం. శ్రీలీలా నటిస్తున్న భారీ చిత్రాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, SSMB28, NBK108, Boyapati Rapo, PVT04, అనగనగా ఒకరాజు, జూనియర్ వంటి చిత్రాలు ఉన్నాయి. నితిన్ సరసన కూడా నటిస్తోంది. 
 

Latest Videos

click me!