‘ఒంటరిగా ఉండటమే మంచిది’.. బంధాలపై నటి సదా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

First Published | May 7, 2023, 5:42 PM IST

‘జయం’ హీరోయిన్ సదా (Sadha) ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉన్నారు. కొంచెం గ్యాప్ తర్వాత వెబ్ సిరీస్ లతో అలరిస్తోంది. ఈ సందర్భంగా ఆమె కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 
 

సీనియర్ హీరోయిన్ సదా (Sada) తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం. ‘జయం’ సినిమాతో వెండితెరపై అలరించిన ఈ ముద్దుగుమ్మ తొలిచిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది. అందం, అభినయం పరంగా ఆకట్టుకుంది. క్రేజ్ దక్కించుకుంది. 
 

నార్త్ బ్యూటీ సదా సౌత్ చిత్రాల్లోనే నటించారు. ఇప్పటికీ దక్షిణాది  ఆడియెన్స్ కు మాత్రమే దగ్గరగా ఉంటున్నారు. మహారాష్ట్రలోని  రత్నగిరిలో జన్మించింది. ఆమె తండ్రి డాక్టర్ కాగా, తల్లి బ్యాంక్ ఉద్యోగి. పుట్టగానే అందాన్ని సొంతం చేసుకున్న సదా..  తేజ రూపొందించిన ‘జయం’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
 


‘అపరిచితుడు’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి స్టార్ హీరోయిన్ గా మారుతుందని భావించిన ఆ తర్వాత వచ్చిన సినిమాల ఫలితాలతో సీన్ రివర్స్ అయ్యింది. దాంతో నాలుగైదు ఏళ్ల నుంచి సదా సినిమాలకు చాలా దూరమయ్యారు. 

కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ వెబ్ సిరీస్ లతో యాక్టివ్ అవుతున్న విషయం తెలిసిందే.  రీసెంట్ గా ‘హాలో వరల్డ్’ సిరీస్ తో అలరించింది. సినిమాల సంగతి ఇలా ఉంచితే.. సదా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా కనిపిస్తున్నారు. నాలుగు పదుల వయస్సుకు చేరుకుంటున్న ఈ ముదుగుమ్మ ఇంకా బ్యాచిలర్ గానే ఉ:ది. 
 

ఎప్పుడూ తన పెళ్లి ప్రస్తావనపై వచ్చినా దాటవేస్తుంటారు. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందని  అభిమానులు ఎదురుచూస్తున్నారు.  ఈ క్రమంలో తాజాగా సదా.. ఆసక్తికరంగా కామెంట్స్ చేసింది. ‘మన జీవితాల్లో కొందరిని దూరంగానే ఉంచాలి. జీవితం చాలా చిన్నది. బలవంతంగా బంధాల్లో ఉండటం కంటే.. ఒంటరిగానే ఉండటం మంచిది’ అంటూ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది.

సినిమాలతో కాకుండా.. బుల్లితెరపైన తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తోంది సదా. పాపులర్ డాన్స్ షో ‘ఢీ’కు జడ్జీగా వ్యవహరించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. బుల్లితెరపై అందాలను ఆరబోసి అదరగొట్టింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ అదిరిపోయే అవుట్ ఫిట్లతో దర్శనమిస్తూ కట్టిపడేస్తోంది.  

Latest Videos

click me!