టైట్ ఫిట్ లో ‘ఢీ’భామ అందాల విందు.. మత్తు చూపులతో హార్ట్ బీట్ పెంచుతున్న నందితా స్వేత..

First Published | Apr 12, 2023, 12:14 PM IST

యంగ్ బ్యూటీ నందితా శ్వేతా (Nandita Swetha) బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. మైండ్ బ్లోయింగ్ గా ఫోజులిస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.  తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. 
 

కుర్రభామ నందితా శ్వేత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అదేవిధంగా క్రేజీగా ఫొటోషూట్లు కూడా చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా  మరిన్ని గ్లామర్ ఫొటోలను పంచుకుంది. 
 

అయితే ఈ కన్నడ నటి నందితా శ్వేత తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం. సినిమాలు, టీవీ షోలతో ఇక్కడి ఆడియెన్స్ ను అలరించింది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో అద్భుతమైన పెర్ఫామెన్స్ తో మంచి గుర్తింపు దక్కించుకుంది. బుల్లితెరపై ‘ఢీ’షోలో జడ్జీగా సందడి చేసింది.
 


నందితా నటించిన ‘బ్లఫ్ మాస్టర్’ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ‘శ్రీనివాస  కళ్యాణం’, ‘ప్రేమ కథా చిత్రం 2’, ‘అధినేత్రి 2’, ‘7’, ‘కల్కి’ వంటి చిత్రాలతోనూ అలరించింది. గతేడాది ‘జెట్టీ’ చిత్రంతో నందితా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  
 

ఈ యంగ్ బ్యూటీ సినిమాలు, టీవీషోలతో కాకుండా సోషల్ మీడియాలోనూ ఎక్కువగా సందడి చేస్తూనే ఉంది. ప్రస్తుతం తెలుగులో పెద్దగా ఆఫర్లు లేవు. దీంతో ఆయా సినిమా ప్రమోషన్స్, పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఉంది. ఈ సందర్భంగా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటుంది.

తాజాగా నందితా ఓ సినిమా ప్రమోషన్స్ కోసం  ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. పింక్ లెహంగాలో, స్లీవ్ లెస్ మ్యాచింగ్ బ్లౌజ్ లో హోయలు పోయింది. టైట్ గా ఉన్న దుస్తుల్లో నందితా మత్తెక్కించేలా ఫోజులిచ్చింది. గుచ్చే చూపులతో కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది.

ఇటీవల అందాల విందులో రెచ్చిపోతున్న యంగ్ బ్యూటీ తాజాగా  కూడా కిర్రాక్ పోజులతో అదరగొట్టింది. ఓపెన్ షోల్డర్ అందాలతో చూపు తిప్పుకోకుండా చేసింది. ఓరకంటి చూపులతో హార్ట్ బీట్ పెంచేసింది. అన్ని యాంగిల్లో అదిరిపోయేలా స్టిల్స్ ఇస్తూ కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ ను ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

Latest Videos

click me!