టాప్ అందాలతో మైమరిపిస్తున్న ‘జాతిరత్నాలు’ చిట్టి.. క్యూట్ స్మైల్ తో కుర్ర హృదయాలకు తీపిగాయం!

First Published | Feb 20, 2023, 5:06 PM IST

‘జాతి రత్నాలు’ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) బ్యూటిఫుల్ లుక్స్ తో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. లేటెస్ట్ గా ఓ ఈవెంట్ లో మెరిసిన ఈ బ్యూటీ.. అందరి చూపు తనపైనే పడేలా చేసింది. ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 
 

తొలిచిత్రంతోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది  యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. 2021లో వచ్చిన రొమాంటిక్ అండ్ కామెడీ ఫిల్మ్ ‘జాతిరత్నాలు’తో మంచి హిట్ ను అందుకుంది. ఆ తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే ఉంది. 
 

‘చిట్టి’గా యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే.  మరోవైపు ఆయన ఈవెంట్లలోనూ సందడి చేస్తున్నారు.  ఈ సందర్భగా తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొని ఆకట్టుకున్నారు. 
 


తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సమీకరణ 2023 మారియట్ బోన్వాయ్ షాదీ కార్యక్రమం వెస్టిన్‌ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం హాజరయ్యారు. 

కార్యక్రమంలో సినీ తారలు రకుల్ ప్రీత్ సింగ్‌, జాకీ భగ్నాని, నైనా సెహ్వాల్‌, రెజీనా, శివాని, శివాత్మిక రాజశేఖర్, చాందిని చౌదరి, దక్ష నాగర్కర్, అక్షర గౌడ, కోమలీ ప్రసాద్, హనీ రోజ్, ప్రదీప్ మాచిరాజు, హెబా పటేల్, ప్రగ్యా జైస్వాల్ తో పాటు ఫరియా అబ్దుల్లా కూడా హాజరయ్యారు. 
 

అయితే, టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ ద్వారా పేద, మధ్యతరగతికి చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు సాయం చేసేందుకు విరాళాలు సేకరిస్తుంటారు. ఇందులో భాగంగా యానివల్ ఈవెంట ను నిర్వహించారు. ఈ సందర్భంగా  సినీ తారలు మెరిశారు. అందులో ఫరియా అబ్దుల్లా ట్రెడిషన్ లుక్ లో హాజరై కట్టిపడేసింది. 
 

క్రీమ్ కలర్ లెహంగా, వోణీలో ఫరియా అబ్దుల్లా మెరిసిపోతోంది. టాప్ అందాలతో మతులు పోగొట్టింది. క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంది. సంప్రదాయ దుస్తుల్లో జాతిరత్నాలు చిట్టి అందరి చూపు తనవైపు మళ్లేలా చేసింది. ప్రస్తుతం ఈ క్యూట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.  
 

సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తున్న ఫరియా.. అటు సినిమాలతో పాటు ఇటు పలు ఈవెంట్లకు హాజరవుతుండటం విశేషం.  ఎక్కడికెళ్లినా తనదైన శైలిలో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు ఫరియా. ప్రస్తుతం ఈ క్యూట్ పిక్స్ కు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులతో పాటు నెటిజన్లు ఫరియా అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తున్నారు. 

కేీర్ విషయానికొస్తే ఫరియా ఇప్పటి వరకు నాలుగు చిత్రాల్లో నటించారు. జాతిరత్నాలు, లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ లో హీరోయిన్ గా మెప్పించింది. బంగార్రాజులో స్పెషల్ అయరెన్స్ తో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో కామియో అపియరెన్స్ తో ఆకట్టుుకుంది. ప్రస్తుతం మాస్ మహారాజా ‘రావణసుర’తో పాటు.. తమిళంలోని ‘వల్లి మయిల్’లో నటిస్తున్నారు. 
 

Latest Videos

click me!