ఒక్క పూటే భోజనం.. నాలుగేండ్ల ప్రేమకు బ్రేకప్.. నటుడు శివ బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు..

First Published | May 16, 2023, 3:02 PM IST

నటుడు శివ బాలాజీ (Siva Balaji) తాజాగా తన జీవితంలోని కొన్ని పంచుకున్నారు. పెళ్లి ముందుకు జరిగిన ఘటనలను తెలియజేయడం ఆసక్తికరంగా మారింది. 
 

నటుడు శివ బాలాజీ చెన్నైలోనే పుట్టిపెరిగాడు. 2003 నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్నారు. ‘ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ’ చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘దోస్త్’,‘కుంకుమ’, ‘పగలే వెన్నెల’, ‘చందమామ’ వంటి  చిత్రాలతో హీరోగా అలరించాడు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే శివబాలాజీకి నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. 

‘ఆర్య’, ‘శంభో శివ భంభో’ చిత్రాలు శివబాలాజీలో మంచి ఫేమ్ ను తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం సినిమాలతో పాటు  వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ వస్తున్నారు. అలాగే Bigg Boss Telugu 1,  నేతోనే డ్యాన్స్, రేస్ వంటి టీవీషోలతోనూ టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యారు. రీసెంట్ గా ‘శాకుంతలం’ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించారు. ఈక్రమంలో శివబాలాజీ ఓ ఛానెల్ కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన జీవితంలోని కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు. 
 


శివ బాలాజీ మాట్లాడుతూ.. ‘చెన్నైలో మా నాన్న ఓ కంపెనీ రన్ చేసేవాడు. నేను సినిమాల్లోకు రావడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. నాకు సినిమాల్లో ఉన్న ఇష్టంతో హీరో అవుదామని హైదరాబాద్ కు రావాలనుకున్న. మా నాన్న మాత్రం చెన్నైలోనే ఉండి వ్యాపారాలు చూసుకోవాలని ఆయన కోరుకునేవాడు. నాకు అది నచ్చలేదు. కొన్ని సందర్భాల్లో నాన్న కోపంగా ఫోన్ చేసేవాడు. అయినా ప్రయత్నాలు ఆపలేదు.  
 

తొలిసారిగా ‘ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ’లో హీరోగా ఛాన్స్ వచ్చింది. రూ.40 వేల వరకు రెమ్యూనరేషన్ వచ్చింది. ఆ వెంటనే చిన్న రూమ్ ను అద్దెకు తీసుకున్నాను. కానీ ఆ తర్వాత అవకాశాలు లేవు. రోజుకు ఒక్క పూట మాత్రమే తినేవాడిని. ఆకలిని చంపుకునేందుకు త్వరగా పడుకునేవాణ్ణి. మంచి నీళ్లతోనే రోజులు గడిపే వాడిని. ఒక నెలమాత్రం చాలా కష్టపడ్డా.’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 

ఇక శివబాలాజీ 2009లో నటి మధుమితను పెళ్లి చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే వీరిద్దరూ  ఇంగ్లీష్ కారన్  (2004) మూవీలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిమధ్య ప్రేమ చిగురించింది. నాలుగేండ్ల పాటు గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ పెళ్లి విషయంలో సమస్యలు ఎదురుకున్నారంట. మొదట్లో వారి జాతకాలు కలవలేదని, మధుమితను పెళ్లి చేసుకుంటే బాలాజీ వాళ్ల అమ్మ చనిపోతుందనే అభిప్రాయంతో శివబాలాజీ బ్రేకప్ చెప్పాడంట. 

దీంతో ఏడాది పాటు శివబాలాజీ మధుమితతో మాట్లాడలేదంట. కనీసం ఫ్రెండ్ గా కూడా ఉండేందుకు ఒప్పుకోలేదంట. అప్పటికే మధుమిత శివబాలాజీని భర్తగా ఊహించుకోవడంతో చాలా  బాధపడిందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఏడాదికి బాలాజీనే కాల్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పడం, మళ్లీ జతకాలను సరిచూడటంతో వీరి పెళ్లి ఘనంగా జరిగిందంట. ప్రస్తుతం వీరి పెళ్లి మేటర్ నెట్టింట వైరల్ గా మారింది. 
 

Latest Videos

click me!