
కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు గురు ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. : ‘మఠ’, ‘ఎద్దేళు మంజునాథ్’ వంటి ప్రజాదరణ పొందిన చిత్రాలకు దర్శకత్వం వహించిన కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు గురుప్రసాద్ (52) అనుమానాస్పదంగా మృతి చెందారు. మాదనాయకనహళ్లి పోలీసుఠాణా పరిధిలోని అపార్ట్‌మెంట్‌లో మూడు రోజుల కిందట ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు బెంగళూరు నగర జిల్లా ఎస్పీ జి.ఎస్.బాబా వెల్లడించారు.
తన కెరీర్‌లో 'మఠం' సినిమా ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. దీంతో ఆయన పేరు మఠం గురు ప్రసాద్‌గా గుర్తింపు పొందారు. తను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే ఆయన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
గురుప్రసాద్ మూడు రోజుల క్రితమే మరణించారని తెలుస్తోంది. ఆయన నివసిస్తున్న అపార్ట్‌మెంట్ నుంచి దుర్వాసన రావడంతో కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల ఎంట్రీతో ఆయన మరణ వార్త వెలుగులోకి వచ్చింది.
గురుప్రసాద్ ఆత్మహత్యకు కారణాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన మరణం వెనుక ఆర్థిక ఇబ్బందులే కారణం అని తెలుస్తోంది. బెంగళూరు రూరల్ నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లిలోని అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న గురుప్రసాద్ (52) మూడు రోజుల క్రితం ఉరివేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆయన పూర్తిపేరు గురుప్రసాద్ రాఘవేంద్ర శర్మ, కనకపుర స్వస్థలం. సినిమాలపై మోజుతో ఆ రంగంలోకి వచ్చి దర్శకుడయ్యారు. సామాజిక అంశాలను బాగా చిత్రీకరించేవారు.
మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన గురుప్రసాద్ ఇటీవలే రెండవ వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెకు కూడా దూరంగా ఉంటున్నట్టు సమాచారం. మరోవైపు అవకాశాలు లేని గురుప్రసాద్ అప్పులపాలయ్యారు. తాగుడుకి బానిసైన ఆయన అప్పులు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
నేను ఆత్మహత్య చేసుకుంటానని సన్నిహితుల వద్ద చెప్పేవాడని తెలిసింది. ఇటీవల ఆయన డైరెక్ట్ చేసిన రంగనాయక సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. షూటింగ్ ముగిసినా ఓ సినిమా విడుదల కాలేదు. కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లోనూ నటించారు.
అందుతున్న సమాచారం మేరకు సినిమాల కోసం గురుప్రసాద్ రూ.3 కోట్ల వరకూ అప్పులు చేశారు. అప్పులు ఇచ్చిన ఫైనాన్షియర్‌లు తరచూ ఒత్తిడి చేసేవారు. ఆ బాధ పడలేక ఆయన తరచూ ఇళ్లు మారుస్తూ వచ్చాడు. కొందరు రుణదాతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి. చెక్ బౌన్స్ కేసులో ఒకసారి అరెస్టయ్యారు.
ఆదివారం సాయంత్రం జరిగాయి. బ్రాహ్మణ విధివిధానాల ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. గురుప్రసాద్ సోదరుడు హరిప్రసాద్, మొదటి భార్య ఆరతి, రెండో భార్య సుమిత్ర, ఇతర కుటుంబ సభ్యులు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
ప్రముఖ దర్శకుడు యోగరాజ్‌భట్, నటుడు దునియా విజయ్, డాలి ధనంజయ, తబలా నాణి, సతీశ్ నీనాసం తదితరులు పాల్గొని నివాళులర్పించారు. కాగా, తన భర్త మృతి పట్ల తనకు ఎలాంటి అనుమానాలు లేవని, అప్పుల బాధ ఎక్కువై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భార్య సుమిత్ర పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అనుమానస్పద మరణంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన ‘రంగనాయక’ సినిమా బాగా ఆడకపోవడంతో అప్పుల పాలై ఉండవచ్చని సినీ ప్రముఖులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మాదనాయకనహళ్లిలో ఎనిమిది నెలల కిందట అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారు. రెండో పెళ్లి చేసుకున్న ఆయన తన భార్యతో కలిసి కనకపుర రహదారిలో ఉన్న ఇంట్లో నివసిస్తున్నారు.
ఆయన దర్శకత్వం వహించిన మఠ చిత్రానికి రాష్ట్ర పురస్కారం వచ్చింది. ఎద్దేళు మంజునాథ్ సినిమా మంచి హిట్ ఇచ్చింది. డైరెక్టర్స్ స్పెషల్ సినిమా ద్వారా డాలిధనంజయ్‌ను హీరోగా కన్నడ చిత్ర రంగానికి ఆయన పరిచయం చేశారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఆత్మహత్యకు ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.