రోల్స్ రాయిస్ కొత్త మోడల్ సెడాన్ ఘోస్ట్‌.. పురాతన చరిత్రను దృష్టిలో పెట్టుకొని డిజైన్..

First Published Sep 5, 2020, 5:34 PM IST

న్యూ ఢీల్లీ: బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ బుధవారం సెకండ్ జనరేషన్ సెడాన్ ఘోస్ట్‌ను విడుదల చేసింది. ఈ సెడాన్ 2021లో భారతదేశంలో రూ.6.95 కోట్ల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు లభిస్తుంది. ఈ కారు సుమారు 11 సంవత్సరాల క్రితమే ప్రదర్శించారు. ఈ కారు ఫీచర్స్ ఇంకా టెక్నాలజీ పరంగా అత్యుత్తమ కారుగా పేరు పొందింది.

ప్రత్యేకంగా డిజైన్కొన్ని నివేదికల ప్రకారం ఈ కారు 116 సంవత్సరాల పురాతన చరిత్రను దృష్టిలో ఉంచుకుని ఈ కారును రూపొందించినట్లు చెప్పారు. సెకండ్ జనరేషన్ ఘోస్ట్ రిజిడ్ అల్యూమినియం సూపర్ ఫ్రేమ్ ఆర్కిటెక్చర్ తో నిర్మించారు. ఆల్ వీల్స్ డ్రైవ్, ఆల్ వీల్స్ స్టీరింగ్‌తో వస్తుంది.
undefined
రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు సైజ్రోల్స్ రాయిస్ ఘోస్ట్ సెడాన్ పొడవు 89 ఎం‌ఎం, వెడల్పు 30 ఎం‌ఎం, ఎత్తు 21 ఎం‌ఎం. అయితే, దాని వీల్‌బేస్‌లో ఎటువంటి మార్పు లేదు. కారుకి ఆటోమేటిక్ సెల్ఫ్ క్లోజ్ డోర్ సిస్టమ్ ఉంది.
undefined
కొత్త లేజర్ హెడ్‌ల్యాంప్‌లుకొత్త రోల్స్ రాయిస్ ఘోస్ట్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లానర్ సస్పెన్షన్ సిస్టమ్‌ను ఇందులో ఉంది. ఈ సెడాన్ కారు ముందు భాగంలో కొత్త లేజర్ హెడ్‌ల్యాంప్‌లను బిగించారు. ఈ లైట్ల సహాయంతో 600 మీటర్ల వరకు చూడవచ్చు. కారుకి సి-ఆకారపు డిఆర్‌ఎల్‌ లైట్లతో వస్తుంది.
undefined
4.8 సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడ్రోల్స్ రాయిస్ ఘోస్ట్ 6.75-లీటర్ ట్విన్-టర్బో వి12 ఇంజిన్‌తో దీనిలో ఉంది, ఇది 571 పిఎస్ శక్తిని 850 ఎన్ఎమ్ పీక్ టార్క్ను వద్ద ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ అన్ని చక్రాలకు శక్తినిస్తుంది. కేవలం 4.8 సెకన్లలో గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. దీని టాప్ స్పీడ్ 250 కి.మీ.
undefined
వెనుక సీట్ లో ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్రోల్స్ రాయిస్ సెడాన్ లో వాతావరణ కంట్రోల్ సిస్టం ఉంది. ఈ కారులో బోస్ బ్రాండ్ 1,300 వాట్ల 18 స్పీకర్లు ఉన్నాయి. ఈ కారు వెనుక సీట్ లో ఎంటర్టైన్మెంట్ స్క్రీన్లు కూడా ఉన్నాయి. ఇది కాకుండా హెడ్-అప్ డిస్ ప్లే, 360 డిగ్రీ కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, వైల్డ్ లైఫ్, పాదచారుల కోసం వార్నింగ్ సిస్టం కూడా ఉంది.
undefined
click me!