దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబం ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల, అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ అండ్ రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ జామ్‌నగర్‌లో చాలా అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అంబానీ కుటుంబానికి చెందిన మహిళలు కోటి రూపాయల విలువైన దుస్తులు, నగలు ధరించారు. అయితే అంబానీ కుటుంబానికి చెందిన మహిళలు ధరించే ఆభరణాలపైనే అందరి దృష్టి పడింది. కానీ చేతికి కట్టిన నల్లటి దారం పై చాలా తక్కువ మంది దృష్టి పెట్టారు.