శ్రావణమాసంలో బంగారం ధరలు ఊగిసలాడుతున్నాయి. తాజాగా బంగారం ధర గడచిన వారం రోజులుగా స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాదులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,450గా ఉంది. అయితే వారం ప్రారంభంలో ఈ ధర రూ. 59,100గా ఉంది. ఈ లెక్కన చూసినట్లయితే బంగారం ధర దాదాపు 300 రూపాయలు పెరిగింది. ఈ వారం రోజుల్లో శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం ఉండటం వల్ల బంగారానికి గిరాకీ భారీగా పెరిగింది.