Vishnu Prakash IPO: విష్ణు ప్రకాశ్ ఐపీవో బంపర్ లిస్టింగ్, రూపాయికి 65 పైసలు లాభం..ఇన్వెస్టర్లకు పండగే..

First Published | Sep 5, 2023, 12:02 PM IST

విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్(IPO) నేడు భారతీయ స్టాక్ మార్కెట్‌లోకి బలంగా ప్రవేశించింది. ఇన్వెస్టర్లకు దాదాపు 65 శాతం లాభాలను అందించింది. 

Vishnu Prakash R Punglia IPO: విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా లిమిటెడ్ (VPRP) ఐపీవో  ఈరోజు స్టాక్ మార్కెట్‌లో బలమైన లాభాలతో లిస్ట్ అయ్యింది. కంపెనీ షేర్లు బిఎస్‌ఇలో రూ.163 వద్ద లిస్టయ్యాయి. కాగా  ఐపిఓ ఆఫర్ గరిష్ట ధర రూ.99 మాత్రమే కావడం విశేషం. అంటే ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు 65 శాతం రాబడిని ఇచ్చింది. ఈ  IPOకు ఇన్వెస్టర్ల నుంచి బలమైన రెస్పాన్స్ వచ్చింది.  ఈ ఇష్యూ మొత్తం 88 సార్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ప్రస్తుతం బలమైన లిస్టింగ్ లాభాల తర్వాత, ఇందులో లాభాలను బుక్ చేయాలా అనే ప్రశ్న ఇన్వెస్టర్లకు కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ షేర్లను ఏం చేయాలో తెలుసుకుందాం. 

నిపుణులు అభిప్రాయం ప్రకారం విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా లిమిటెడ్ (VPRPL) స్టాక్ మార్కెట్‌లో ఈరోజు బలమైన ప్రారంభాన్ని సాధించింది. ఇది బిఎస్‌ఇలో ఒక్కో షేరుకు రూ. 163 చొప్పున లిస్టింగ్ అయ్యింది, ఇది ఇష్యూ ధర కంటే దాదాపు 65 శాతం ప్రీమియంతో లాభాలు అందించడం విశేషం. 


వాటర్ సప్లై సెక్టార్‌లో బలమైన ట్రాక్ రికార్డ్‌తో బాగా స్థిరపడిన కంపెనీ కావడంతో కంపెనీ లిస్టింగ్ అంచనాలకు అనుగుణంగా ఉంది. కంపెనీ వివిధ ప్రభుత్వ కాంట్రాక్టుల నుంచి కూడా లబ్ది పొందుతోంది, రాబోయే సంవత్సరాల్లో దాని వృద్ధిని పెంచే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లు కూడా IPOకి అద్భుతమైన స్పందనను అందించారు ,  ఈ ఇష్యూ 87.82 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. 

IPOలో షేర్లు అలాట్ అయిన పెట్టుబడిదారుల లక్ష్యాలు స్వల్పకాలికమైనట్లయితే వారు వెంటనే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్న పెట్టుబడిదారులు ఈ షేర్లను తమ పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోవచ్చు.

బ్రోకరేజీలు ఏమంటున్నాయి..
బ్రోకరేజ్ హౌస్ నిర్మల్ బ్యాంగ్ ప్రకారం, కంపెనీ నీటి సరఫరా ప్రాజెక్టుల విభాగంలో ఉంది. కంపెనీ  వాల్యుయేషన్‌ ఇతర లిస్టెడ్ పోటీకంపెనీలతో పోల్చితే ఆకర్షణీయంగా ఉంది. నీటి-సంబంధిత ప్రాజెక్టులు, రైల్వేలు,  రోడ్లపై కేంద్ర ప్రభుత్వం దృష్టి కొనసాగే అవకాశం ఉన్నందున, మంచి లాభదాయకతతో అధిక వృద్ధిని VPRP సాధించే వీలుందని  బ్రోకరేజ్ అభిప్రాయపడింది.
 

VPRP బలమైన వృద్ధికి సంబంధించిన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉంది. బలమైన ఆర్డర్ బుక్ భవిష్యత్ వృద్ధిని సూచిస్తోంది. FY 2021-23లో కంపెనీ ఆర్డర్ బుక్ 49% పెరిగింది. జూలై 15, 2023 నాటికి, VPRP రూ. 3800 కోట్ల ఆర్డర్ బుక్‌ను కలిగి ఉంది. ఈ ఐపీఓ నుంచి కంపెనీ రూ.58.64 కోట్లను పరికరాల కొనుగోలుకు వినియోగించనుంది. అదే సమయంలో కంపెనీ అవసరాలు, కార్పొరేట్ లక్ష్యాలను తీర్చేందుకు రూ.140 కోట్లు వినియోగిస్తారు.
 

Latest Videos

click me!