బ్యాంకింగ్ సేవల నుండి వాహన బీమా ప్రీమియంల వరకు: జూన్ 1 నుండి మారనున్న రూల్స్ ఇవే..

Ashok Kumar   | Asianet News
Published : May 31, 2022, 05:53 PM IST

మే నెల ముగిసి జూన్ నెల వచ్చేస్తోంది, అయితే జూన్ 1 నుంచి కొన్ని సేవలు మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం నాటకీయంగా పెరగడంతో ఈ మార్పు రానుంది. కరోనావైరస్ మహమ్మారి, భౌగోళిక రాజకీయ పరిస్థితులు పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయి. ఈ మార్పులు మనపై ఎలా ప్రభావం చూపుతాయి ? మీకు ఏదైనా వాహనం ఉంటే లేదా కొత్తది కొనాలని ఆలోచిస్తున్నట్లయితే జూన్ 1 నుండి ఇన్సూరేన్స్ ప్రీమియం పెరగనుంది. అంతేకాకుండా కొన్ని బ్యాంకులు కొన్ని సేవల క్యాటగిరిలో మార్పులను ప్రకటించాయి.  

PREV
13
బ్యాంకింగ్ సేవల నుండి వాహన బీమా ప్రీమియంల వరకు: జూన్ 1 నుండి మారనున్న రూల్స్ ఇవే..

ఈ మార్పుల లిస్ట్, అవి ఎలా ప్రభావం చూపనున్నాయంటే :

ఇన్షూరెన్స్ ప్రీమియంలు
గత వారం, రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) వివిధ వర్గాల వాహనాలకు థర్డ్-పార్టీ మోటార్ ఇన్షూరెన్స్ ప్రీమియంను పెంచినట్లు ప్రకటించింది. జూన్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.

23

సవరించిన ధరలు ఇవే:
1,000cc ఇంజన్ సామర్థ్యం ఉన్న ప్రైవేట్ కార్లు రూ.2,072 కి బదులుగా రూ.2,094 ఆకర్షిస్తాయి.

 ఇంజన్ సామర్థ్యం 1,000cc-1,500cc ఉన్న ప్రైవేట్ కార్లు రూ.3,221 తో పోలిస్తే రూ.3,416 ఆకర్షిస్తాయి.

అయితే, 1,500 cc కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న కార్ల ప్రీమియం రూ.7,897 నుండి రూ.7,890కి తగ్గుతుంది.

150cc కంటే ఎక్కువ  350cc కంటే తక్కువ ఉన్న ద్విచక్ర వాహనాలు రూ.1,366 ప్రీమియంను ఆకర్షిస్తాయి.

350cc పైగా ఇంజన్ సామర్థ్యం  ఉన్న ద్విచక్ర వాహనాలకు, సవరించిన ప్రీమియం రూ.2,804.

అయితే, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు ఇన్షూరెన్స్ ప్రీమియంలపై 7.5 శాతం తగ్గింపు లభిస్తుంది.

30 KW కంటే తక్కువ పవర్ అవుట్‌పుట్ సామర్థ్యం ఉన్న ప్రైవేట్ ఇ-వాహనాలకు   రూ.1,780 ఛార్జ్ చేయబడుతుంది.

30KW అండ్ 65KW మధ్య ఉన్న వాటికి థర్డ్-పార్టీ ఇన్షూరెన్స్ కోసం రూ.2,904 ఛార్జ్ చేయబడుతుంది.

33

బ్యాంకింగ్ సేవలు
SBI హోమ్ లోన్  లెండింగ్ రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచి 7.05 శాతానికి పెంచింది.

యాక్సిస్ బ్యాంక్ జూన్ 1 నుండి జీతం, పొదుపు ఖాతాలకు సర్వీస్ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది.  ఇంకా ఆవరేజ్ బ్యాలెన్స్ రూ.15,000 నుండి రూ.25,000కి సవరించింది.

మే ప్రారంభంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్‌బిఐ పాలసీ రేట్లను పెంచిన తర్వాత ఈ బ్యాంకింగ్ నిబంధనలు మార్చబడ్డాయి. ఈ నెలలో మరిన్ని రేట్లు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

click me!

Recommended Stories