మిలిటరీపై అత్యధికంగా ఖర్చు చేసిన టాప్ 10 దేశాలు..? భారత్, చైనాల ప్లేస్ ఎంతంటే ?

Published : Aug 19, 2023, 07:29 PM IST

కేంద్ర ప్రభుత్వ ముఖ్యమైన డ్యూటీ  దేశ భద్రత. అంతర్గతంగా  ఇంకా  బయటి శత్రువుల నుండి దేశాన్ని రక్షించడానికి ప్రతి దేశం స్వంత సైనిక వ్యవస్థ ఉంటుంది. ప్రతి దేశాల పౌరులు ఎల్లప్పుడూ సైనిక దళాలతో ఆయుధాలతో  ఉంటారు. జాతీయ భద్రతపై అత్యధికంగా ఖర్చు చేసే టాప్ 10 దేశాలు ఏవి ? మరి భారతదేశం ఎ ప్లేస్ లో ఉందొ చూద్దాం...   

PREV
110
 మిలిటరీపై అత్యధికంగా ఖర్చు చేసిన టాప్ 10 దేశాలు..? భారత్, చైనాల ప్లేస్ ఎంతంటే ?

10. సౌత్ కొరియా:

ఈస్ట్  ఆసియాలోని అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటైన సౌత్  కొరియా  దేశ భద్రతకు 46 బిలియన్ డాలర్లు కేటాయించి 10వ స్థానంలో నిలిచింది.

210

09. జపాన్:

అభివృద్ధి చెందిన చిన్న దేశాలలో ఒకటిగా ఉన్న జపాన్ భద్రత విషయంలో మాత్రం వెనుకంజ వేయలేదు. పొరుగున ఉన్న రష్యా దురాక్రమణను ఎదుర్కోవడానికి జపాన్ గత ఏడాది  సైన్యం కోసం 46 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.

310

08. ఫ్రాన్స్:

అధికారిక అణ్వాయుధ దేశాలలో ఒకటైన ఫ్రాన్స్ కూడా NATOలో భాగం. 2022లో ఫ్రాన్స్ మిలటరీ కోసం 54 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
 

410

07. జర్మనీ:

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, జర్మనీ  భద్రత పరంగా ఫీనిక్స్ లాగా ఎదిగింది. గత సంవత్సరం, జర్మనీ  మిలిటరీ కోసం 54 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.

510

06. యునైటెడ్ కింగ్‌డమ్:

ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన యునైటెడ్ కింగ్‌డమ్ గత ఏడాది  మిలిటరీ కోసం 69 బిలియన్ డాలర్లు ఖర్చు చేసి 6వ స్థానంలో నిలిచింది.

610

05. సౌదీ అరేబియా:

సౌదీ అరేబియా కూడా భద్రతపై ఖర్చు చేయడంలో వెనుకబడి లేదు. 2022 నాటికి, సౌదీ అరేబియా సైనిక వ్యవస్థపై 75 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది
 
 

710

04. భారతదేశం:

అత్యధిక జనాభా కలిగిన ఆసియా పవర్‌హౌస్ అయిన భారతదేశం పొరుగున ఉన్న పాకిస్తాన్ ఇంకా చైనా నుండి చాలా సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ కారణంగా భారతదేశం గత సంవత్సరం మిలిటరీ కోసం 81 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
 

810

03. రష్యా:

విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఉన్న రష్యా ప్రస్తుతం పొరుగుదేశమైన ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తోంది. అనేక దేశాలను ఎదుర్కోవడానికి రష్యా గత ఏడాది  మిలిటరీపై 86 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
 

910

02. చైనా:

కమ్యూనిస్టు దేశమైన చైనా కూడా భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడలేదు. గత ఏడాది చైనా  సైన్యం కోసం మొత్తం 292 బిలియన్ డాలర్లు వెచ్చించింది.
 

1010

01. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా:

పై 9 దేశాలు మిలిటరీపై మొత్తం 805 బిలియన్ డాలర్లు ఖర్చు పెడితే.. ప్రపంచానికి పెద్దన్నగా ఉన్న అమెరికా 2022లో 877 బిలియన్ డాలర్లను మిలిటరీపై ఖర్చు చేస్తుందంటే నమ్మాల్సిందే.

click me!

Recommended Stories