రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తన 50వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. 2013లో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని ఉమేద్ భవన్ ప్యాలెస్‌లో రెండు రోజుల పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ బర్త్ డే పార్టీ దేశంలోనే అత్యంత ఖరీదైన బర్త్ డే పార్టీగా పేర్కొంటున్నారు.
ఈ పార్టీ మొత్తం ఖర్చు USD 30 మిలియన్లు అంటే దాదాపు 220 కోట్ల రూపాయలకు సమానం. నవంబర్ 1, 2013న జరిగిన భారీ ఉత్సవాల్లో దాదాపు 250 మంది ప్రముఖులు పాల్గొన్నారు. అతిథులు దాదాపు 32 చార్టర్డ్ విమానాల ద్వారా పార్టీకి చేరుకున్నారు. ఈ ఖర్చును రిలయన్స్ గ్రూప్ భరించింది.
ఈ వేడుక నవంబర్ 1న ధన్తేరస్ పూజతో ప్రారంభమైంది, ఇందులో నీతా అంబానీ పేరుతో దీపాలు వెలిగించారు. ధీరూభాయ్ అంబానీ ముఖాన్ని రూపొందించిన లైట్ షో ఆకాశాన్ని అలంకరించింది. దింతో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ లైట్ వండర్ సృష్టించేందుకు సింగపూర్ నుంచి ప్రత్యేక బృందం వచ్చింది.
గెస్టుల లిస్టులో మిట్టల్స్, మహీంద్రా, బిర్లా, గోద్రెజ్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, కరిష్మా కపూర్, రాణి ముఖర్జీ ఇంకా మొత్తం ముంబై ఇండియన్స్ IPL టీం అలాగే ఇతర వ్యాపార కుటుంబాలు, ప్రముఖులు ఉన్నారు.
ఈ ఈవెంట్ కోసం పువ్వులు థాయిలాండ్ నుండి ప్రత్యేకంగా ఆర్డర్ చేయబడ్డాయి. అలాగే పిల్లలను ఎంటర్టైన్ చేయడానికి లండన్ నుండి కిడ్-ఫ్రెండ్లీ రైడ్‌లను రప్పించారు. ఈ వేడుకలో సంగీత విద్వాంసుడు ఎ.ఆర్. రెహమాన్, ప్రియాంక చోప్రా, నీతా అంబానీల కూతురు ఇషా అంబానీ ప్రత్యేక డాన్స్ ప్రదర్శన చేశారు.