5 మిలియన్ అమెరికన్ డాలర్ల ఆస్తులున్న రవీంద్రన్ ఇప్పుడు 400 మిలియన్ డాలర్ల ఆర్థిక నష్టంలో ఉన్నారు. జీతాలు అందక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది కంపెనీని విడిచిపెట్టారు. నష్టాల్లో కూరుకుపోయిన కంపెనీని ఉద్యోగులు కంపెనీని వీడకముందే పూడ్చుకునేందుకు రవీంద్రన్ కష్టపడుతున్నారు.
కరోనా సమయంలో బైజస్ ఆదాయంలో రికార్డు నమోదు చేసింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్రబలంగా మారింది. దీని వల్ల బైజస్ క్యాపిటల్ పెంచింది. కానీ కరోనా తొలగడంతో బైజస్ పతనం ప్రారంభమైంది. ఉద్యోగాల కోతతో సహా అనేక ఖర్చు తగ్గింపు చర్యలను కంపెనీ తీసుకున్నప్పటికీ, అప్పుల ఊబి నుంచి బయటపడలేకపోయింది. దింతో చాలా మంది ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గారు. ఇప్పుడు రవీంద్రన్ పోరాటాన్ని ఉధృతం చేశారు.