ఈ పథకాల్లో 20 ఏళ్లపాటు నెలకు రూ.10,000 పెట్టుబడి పెట్టడం ద్వారా లభించే ప్రయోజనాలను పోల్చి చూద్దాం.
SIP పెట్టుబడిలో సగటున సంవత్సరానికి 10% రాబడి వస్తుందని అనుకుంటే మీ పెట్టుబడి దాదాపు రూ.76 లక్షలకు పెరుగుతుంది.
అదే జాతీయ పింఛను పథకంలో సగటున 9% రాబడితో మొత్తం దాదాపు రూ.66 లక్షలు అవుతుంది. PPF పథకం 7.10% వడ్డీ రేటుతో దాదాపు రూ.52 లక్షలకు పెరుగుతుంది. దీన్ని బట్టి ఏ స్కీమ్ లో పెట్టుబడి పెడితే మంచిదో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.