QR Code Payment Scams
దేశవ్యాప్తంగా ఆన్ లైన్ పేమెంట్స్ పెరిగిపోయాయి... ఇప్పుడు బడా షాపింగ్ మాల్స్ నుండి తోపుడుబండిపై అమ్మే కూరగాయాల వరకు ప్రతి దగ్గర క్యూఆర్ కోడ్ ఉపయోగిస్తున్నారు. ఇలా ఆన్ లైన్ పేమెంట్స్ పెరిగిపోయిన వేళ సైబర్ మోసాలు కూడా పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో రోజురోజుకు ఈ మోసాలకు సంబంధించిన కేసులు పెరిగిపోతున్నాయి.
ఆన్‌లైన్ చెల్లింపుల ట్రెండ్ పెరగడంతో ప్రజలు ఇప్పుడు నగదుకు బదులుగా ఆన్‌లైన్ చెల్లింపులపై ఆధారపడుతున్నారు. ప్రతిసారి డబ్బులు పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం లేకుండా కేవలం ఫోన్ ద్వారానే చెల్లింపులన్ని చేయవచ్చు. ఇది సులభమైన చెల్లింపు పద్ధతి.
QR Code Payment Scams
అయితే పోన్ పే, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్స్ ద్వారా తప్పులు జరిగి డబ్బులు వేరేవాళ్లకు వెళ్లవచ్చు. కానీ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించేటప్పుడు ఖాతా నంబర్ తప్పు కావడానికి, డబ్బు వేరే వాళ్లకు వెళ్లడానికి అవకాశం లేదు. అందువల్ల చాలా మంది దీన్ని సురక్షితమైనదిగా భావించి QR కోడ్ ద్వారా చెల్లిస్తున్నారు. ప్రజల ఈ నమ్మకాన్ని ఉపయోగించుకుని QR కోడ్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
QR Code Payment Scams
లాటరీ గెలిచారు... డబ్బులు వేయడానికి ఈ QR కోడ్‌ని స్కాన్ చేయమని మీ మొబైల్‌కి SMS వస్తే అది మోసమే కావచ్చు. సైబర్ నేరస్థులు లాటరీ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకోవచ్చని ఆశ చూపి, హానికరమైన QR కోడ్‌ని స్కాన్ చేయమని చెబుతారు. మీరు స్కాన్ చేసి PIN నంబర్ టైప్ చేస్తే మీ ఖాతా నుండి ఒక్క నిమిషంలో పెద్ద మొత్తం డబ్బు పోతుంది.
QR Code Payment Scams
ఈ మోసాన్ని ఎలా నివారించాలి? ఇలాంటి ఆన్‌లైన్ మోసాలను నివారించడానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని రోజుల క్రితం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. QR కోడ్ చెల్లింపుల కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది... స్కాన్ చేయడం వల్ల డబ్బులు రావని వినియోగదారులు గుర్తుంచుకోవాలి.
QR Code Payment Scams
మీ మొబైల్‌లో ఆన్‌లైన్ చెల్లింపు యాప్‌లను ఉపయోగిస్తే దానికి బలమైన స్క్రీన్ లాక్ పెట్టుకొండి. మీ PIN నంబర్‌ను ఎవరితోనూ షేర్ చేసుకోకండి.
QR Code Payment Scams
తప్పుగా ఏదైనా ఆన్‌లైన్ మోసంలో చిక్కుకుంటే ఎక్కడ ఫిర్యాదు చేయాలి? దానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొందరు QR కోడ్ మోసాల బారిన పడుతున్నారు. వారు www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు. 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చు.