అలాగే దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. భారతదేశంలో ఇంధన ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సవరించబడతాయి. జూన్ 2017కి ముందు ప్రతి 15 రోజులకు ఒకసారి ధరల సవరణ జరిగేది.
ఛత్తీస్‌గఢ్‌లో పెట్రోల్ ధర 50 పైసలు, డీజిల్ ధర 49 పైసలు పెరిగింది. జార్ఖండ్‌లో పెట్రోల్ డీజిల్ రెండూ 26 పైసలు పెరిగాయి. దీంతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఎగిశాయి. పశ్చిమ బెంగాల్‌లో పెట్రోల్ 46 పైసలు, డీజిల్ 43 పైసలు తగ్గాయి. పంజాబ్‌లో పెట్రోల్ 36 పైసలు, డీజిల్ 34 పైసలు తగ్గాయి. జమ్ముకశ్మీర్, హిమాచల్, రాజస్థాన్‌లలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు దిగొచ్చాయి.