Pan-Aadhaar Link:పాన్-ఆధార్ లింక్ చేయడానికి చివరి తేదీ ఇదే.. లేదంటే డబుల్ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది

Ashok Kumar   | Asianet News
Published : Jun 04, 2022, 04:24 PM IST

మీరు ఇంకా పాన్- ఆధార్ లింక్ చేయకుంటే వీలైనంత త్వరగా చేయండి, లేకుంటే పెద్ద ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇప్పుడు జరిమానాతో పాన్- ఆధార్ లింక్ చేయడానికి గడువు జూన్ 30తో ముగుస్తుంది. ఈ తేదీ లోపు పాన్-ఆధార్ లింక్ చేస్తే రూ. 500 జరిమానా చెల్లించాలి. ఆ తర్వాత చేస్తే అప్పుడు రెట్టింపు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 

PREV
13
Pan-Aadhaar Link:పాన్-ఆధార్ లింక్ చేయడానికి చివరి తేదీ ఇదే..  లేదంటే డబుల్ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) సర్క్యులర్ జారీ ద్వారా పాన్ కార్డ్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయడానికి 31 మార్చి 2022 తేదీని నిర్ణయించడం గమనించదగ్గ  విషయం. దీని తర్వాత రూ.500 జరిమానాతో జూన్ 30 వరకు అనుమతినిచ్చింది. కానీ, ఈ చివరి తేదీ లోగా పాన్- ఆధార్ లింక్ చేయకపోతే ఈ జరిమానా రెండింతలకు  అంటే 1000 రూపాయలకు పెరుగుతుంది. 

23

పాన్ కార్డ్ ఇన్‌యాక్టివ్‌
ఈ లెట్ ఫీజును చలాన్ నంబర్ ITNS 280 ద్వారా చెల్లించవచ్చు. మీరు మీ పాన్‌ను మీ ఆధార్ నంబర్‌తో లింక్ చేయకుంటే మీ పాన్ కార్డ్ పనిచేయకపోవచ్చు. పాన్ కార్డ్ హోల్డర్ సమస్య ఇక్కడితో ముగియదు. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే మీరు మ్యూచువల్ ఫండ్‌లు, స్టాక్‌లు, ఓపెన్ బ్యాంక్ ఖాతాలు మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టలేరు. ఎందుకంటే ఇక్కడ పాన్ కార్డును అందించడం అవసరం. ఇంకా, ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 272B కింద, మీరు చెల్లని పాన్ కార్డ్‌ని చూపితే అసెస్సింగ్ అధికారి పీనల్ ఆక్షన్  తీసుకోవచ్చు.
 

33

ఈ విధంగా చేయండి
మొదట https://www.incometax.gov.in/iec/portal ఓపెన్ చేసి హోమ్‌పేజీలో లింక్ ఆధార్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత అడిగిన సమాచారాన్ని ఎంటర్ చేసి, మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియను పూర్తి చేయండి. అంతే కాకుండా, మీరు SMS ద్వారా కూడా  పాన్ ఆధార్ కార్డ్‌ లింక్  చేయవచ్చు. ఈ విధంగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి, మీరు మీ మొబైల్ నుండి 567678 లేదా 56161కి మెసేజ్ చేయాలి. 
 

click me!

Recommended Stories