ఇండియాలోనే అత్యంత కాస్ట్లీ .. నీతా అంబానీకి దీపావళి గిఫ్ట్.. ఎన్ని కోట్లో తెలుసా..?

First Published | Nov 8, 2023, 6:11 PM IST

భారతదేశంలోనే నంబర్ 1 ధనవంతుడు అయిన ముఖేష్ అంబానీకి విలాసవంతమైన లైఫ్ స్టయిల్ గురించి ఖచ్చితంగా అందరికి తెలిసే ఉంటుంది. ఆయనకు లేని లగ్జరీ కార్లు లేవని చెప్పొచ్చు. ముఖేష్ అంబానీ కుటుంబానికి వివిధ లగ్జరీ కార్లు ఉన్నాయి.

 ఈ  భారతదేశపు అత్యంత సంపన్నుడు కార్ల కలెక్షన్ మరో రోల్స్ రాయిస్ కల్లినన్‌ వచ్చి చేరింది. తన భార్య నీతా అంబానీకి ఈ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. Rolls-Royce Cullinan బ్లాక్ బ్యాడ్జ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.2 కోట్లు. అయితే నీతా అంబానీ భారతదేశపు అత్యంత ఖరీదైన కారు గ్రహీత అయ్యారు.
 

నివేదికల ప్రకారం, దీపావళి సందర్భంగా ముఖేష్ అంబానీ ఈ ఖరీదైన గిఫ్ట్ ని నీతా అంబానీకి బహుమతిగా ఇవ్వవచ్చు. ముఖేష్ అంబానీ కుటుంబంలో ఇప్పటికే చాలా రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి, ఇప్పుడు ఆ కుటుంబంలోకి కొత్త రోల్స్ రాయిస్ కారు వచ్చి చేరింది.
 


Rolls Royce Cullinan Black Badge-5

రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ సాధారణ కుల్లినన్ కారు మోడల్ కంటే ఎన్నో  ఫీచర్స్  ఉన్నాయి. స్టాండర్డ్ కుల్లినాన్‌తో దీనిలో 6.75-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V12 పెట్రోల్ ఇంజన్‌ వస్తుంది, అయినప్పటికీ దీని ఇంజన్ సాధారణ కుల్లినన్ కంటే శక్తివంతమైనది.

సాధారణ క్యుల్లినన్ కారు 571 PS, 800 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తే, రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ కారు గరిష్టంగా 600 PS అండ్  900 Nm టార్క్‌ను ఉత్పత్తి  చేస్తుంది. అయితే, సాధారణ క్యూలైనన్ లాగేనే Cullinan బ్లాక్ బ్యాడ్జ్ 250 kmph టాప్ స్పీడ్  అందుకుంటుంది. 

రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ లోపలి భాగం చక్కటి మెటీరియల్‌తో ఫినిషింగ్ చేసారు. వెంటిలేటెడ్ మసాజింగ్ సీట్, పెద్ద స్క్రీన్ వంటి థియేటర్, అద్భుతమైన ఆడియో సిస్టమ్, డ్రింక్స్ చల్లగా ఉంచడానికి చిన్న ఫ్రిజ్ వంటి ఎన్నో హైలెట్స్  ఉన్నాయి. 

అయితే, భారతదేశంలో రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్‌ ఉన్న మొదటి వ్యక్తి ముఖేష్ అంబానీ కాదు. షారుఖ్ ఖాన్ కొన్ని నెలల క్రితం   తెలుపు రంగులో రోల్స్ రాయిస్ కల్లినన్ కొనుగోలు చేశాడు. కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ ప్రస్తుతం రోల్స్ రాయిస్‌కు ఫ్లాగ్‌షిప్ వాహనంగా ఉంది, దీని లైనప్‌లో ఫాంటమ్ VIII అండ్  ఘోస్ట్ సెడాన్‌లు కూడా ఉన్నాయి.

Latest Videos

click me!