Criminal Laws: మన దేశంలో జూలై 1, 2024 నుంచి 'భారతీయ న్యాయ సంహిత'(BNS), 'భారతీయ నాగరిక సురక్ష సంహిత'(BNSS) అనే కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాల ప్రకారం నేరాలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించారు.
భారతదేశంలో జూలై 1, 2024 నుండి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల ప్రకారం నేరాల వర్గీకరణ ఎలా ఉంది? పోలీసులు ఏ సందర్భాలలో కోర్టు అనుమతి లేకుండా అరెస్టు చేయవచ్చు? ఆ వివరాలు తెలుసుకుందామా..
25
కొత్త చట్టాల ప్రకారం నేరాలు
మన దేశంలో జూలై 1, 2024 నుంచి 'భారతీయ న్యాయ సంహిత'(BNS), 'భారతీయ నాగరిక సురక్ష సంహిత'(BNSS) అనే కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాల ప్రకారం నేరాలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించారు. అవేంటో, పోలీసుల అధికారాలు ఎలా ఉంటాయో అడ్వకేట్ వివరించారు.
35
కాగ్నిజబుల్ నేరాలు (Cognizable Offenses):
తీవ్రమైన నేరాలను కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని పిలుస్తారు. ఎవరైనా వ్యక్తి తీవ్రమైన నేరం చేశాడని ఫిర్యాదు అందితే, పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి కోర్టు అనుమతి లేకుండానే నిందితుడిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపవచ్చు.
ఉదాహరణలు: మర్డర్ కేసులు, అటెంప్ట్ మర్డర్ మరియు రేప్ కేసులు ఈ వర్గంలోకి వస్తాయి.
తక్కువ తీవ్రత ఉన్న నేరాలను నాన్-కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటారు. ఇలాంటి నేరాలలో కోర్టు ముందస్తు అనుమతి లేదా వారెంట్ లేకుండా నిందితులను అరెస్టు చేయడానికి పోలీసులకు అవకాశం ఉండదు.
55
కొత్త చట్టాలపై అవగాహన..
కొత్త చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ప్రతి పౌరుడి బాధ్యత. ముఖ్యంగా అరెస్టు ప్రక్రియ, పోలీసుల పరిమితుల గురించి తెలుసుకోవడం వల్ల చట్టపరమైన చిక్కుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.