Mukesh Ambani To Salil Parekh:భారత్‌లో ఏడాదికి కోట్ల జీతం తీసుకుంటున్న వ్యక్తి ఎవరో తెలుసా...

Ashok Kumar   | Asianet News
Published : May 27, 2022, 11:07 AM ISTUpdated : May 27, 2022, 11:09 AM IST

దిగ్గజ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ నుండి బిగ్ న్యూస్ వెలువడింది. ఏంటంటే కంపెనీ సీఈవో సలీల్ పరేఖ్ జీతం భారీగా పెరిగింది. ఈ పెరుగుదల చిన్నదేమీ కాదు, ఏకంగా 88 శాతం  పెంపు. దీంతో సలీల్ పరేఖ్ జీతం ఏటా రూ.42 కోట్ల నుంచి రూ.79.75 కోట్లకు పెరిగింది.   

PREV
14
Mukesh Ambani To Salil Parekh:భారత్‌లో ఏడాదికి కోట్ల జీతం తీసుకుంటున్న వ్యక్తి ఎవరో తెలుసా...

జీతాల పెంపునకు సంబంధించి కంపెనీ వెల్లడించిన సమాచారంలో సలీల్ పరేఖ్ నాయకత్వంలో ఇన్ఫోసిస్ అద్భుతమైన వృద్ధిని సాధించింది. సలీల్ పరేఖ్ చేసిన కృషికి అతనికి ఈ పెంపు చెల్లించినట్లు కంపెనీ తెలిపింది. తాజాగా కంపెనీ సీఈవోగా ఆయన పదవీకాలాన్ని ఐదేళ్లపాటు పొడిగించగా, ఆ వెంటనే ఆయనకు భారీగా జీతాలు పెంచడం గమనార్హం. సలీల్ పరేఖ్‌కు IC సెక్టార్‌లో 30 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది.

2018లో ఇన్ఫోసిస్‌లో చేరిన సలీల్ పరేఖ్ ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఇన్ఫోసిస్‌లో చేరడానికి ముందు అతను క్యాప్‌జెమినీలో 25 సంవత్సరాలు పనిచేశాడు. జీతాల పెంపు విషయంలో దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (tcs) సీఈవో రాజేష్ గోపీనాథన్‌ను కూడా సలీల్ పరేఖ్ అధిగమించడం గమనార్హం. గతంలోని నివేదిక ప్రకారం, 2022 ఆర్థిక సంవత్సరంలో గోపీనాథన్‌కు దాదాపు 26.6 శాతం జీతం పెరిగింది.

24

1.ఇన్ఫోసిస్ సీఈవోగా వ్యవహరిస్తున్న సలీల్ పరేఖ్ ఆర్థిక సంవత్సరం 2021-22కిగానూ రూ.71 కోట్ల వార్షికవేతనం అందుకుంటున్నారు. దీంతో భారత్‌లో అత్యధిక వార్షికవేతనం పొందుతున్న సీఈవోగా సలీల్ పరేఖ్ నిలిచారు. 

2.రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి కంపెనీలో 44 శాతానికిపైగా వాటా ఉంది. ఇందుకుగానూ 2020లో రూ.15 కోట్ల వార్షికవేతనం అందుకున్నారని రిపోర్టులు చెబుతున్నాయి.

3.సీపీ గుర్నామీ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రాకు సీఈవో, ఎండీగా వ్యవహరిస్తున్నారు.  ఒక రిపోర్ట్ ప్రకారం ఆర్థిక సంవత్సరం 2020లో రూ.28.57 కోట్ల వార్షిక జీతాన్ని ఆర్జించారు.

34

4.మల్టీ నేషనల్ కంపెనీ లార్సెన్ అండ్ టుబ్రో(L&T)కి సీఈవో, ఎండీగా వ్యవహరిస్తున్న ఎస్ఎన్ సుబ్రమణ్యన్ 2019-20లో రూ.27.17 కోట్ల జీతాన్ని అందుకున్నారు. అయితే కొవిడ్ నేపథ్యంలో 43.91 శాతాన్ని స్వచ్ఛంధంగా కోత విధించుకున్నారు. 

5.ఎన్ చంద్రశేఖరన్ 2017లో టాటాసన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక అప్పటి వరకూ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఎఫ్‌వోగా ఉన్న  రాజేష్ గోపినాథన్ సీఈవోగా నియమితులయ్యారు. 2021-22 ఏడాదికిగానూ రూ.25.7 కోట్ల జీతాన్ని అందుకున్నారు.

6.హీరో మోటోకార్ప్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న పవన్ ముంజల్ ఆర్థిక సంవత్సరం 2020లో ఏకంగా రూ.84.59 కోట్ల వార్షిక జీతం తీసుకున్నారని ఒక రిపోర్ట్ పేర్కొంది.
 

44

7.బజాజ్ ఆటో సీఈవో, ఎండీగా కొనసాగుతున్న రాజీవ్ బజాజ్ 2020 ఆర్థిక సంవత్సరంలో రూ.39.86 కోట్ల జీతం ఆర్జించారు.

8.సునీల్ మిట్టల్ (భారతీ ఎంటర్‌ప్రైజెస్)సునీల్ మిట్టల్ భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకులు, చైర్మన్. ఆర్థిక సంవత్సరంలో 2020లో రూ.30.1 కోట్ల జీతం పొందాడు.

9.సిద్ధార్థ లాల్ (ఐషర్ మోటార్స్ లిమిటెడ్)ఐషర్ మోటార్స్ లిమిటెడ్ బాస్ సిద్ధార్థ లాల్ ఆర్థిక సంవత్సరంలో రూ.19.21 కోట్ల వార్షిక వేతనం పొందారు. 2019లో రూ.12.81 కోట్ల నుంచి భారీగా పెరిగింది.

10.సంజీవ్ పురి(ఐటీసీ లిమిటెడ్)సంజీవ్ పురి మే 2019 నుంచి ఐటీసీ లిమిటెడ్ చైర్మన్, ఎండీగా కొనసాగుతున్నారు. 2020-21లో రూ.10.10 కోట్ల వార్షిక వేతనాన్ని పొందారని ఒక రిపోర్ట్ పేర్కొంది.

11.ఎన్ చంద్రశేఖరన్ (టాటా సన్స్)టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఆర్థిక సంత్సరం 2020లో రూ.58 కోట్ల వార్షిక జీతాన్ని తీసుకున్నారని ఒక నివేదిక పేర్కొంది. కాగా ఆర్థిక సంవత్సరం 2019లో ఆయన రూ.66 కోట్లు పొందారని వెల్లడించింది.

click me!

Recommended Stories