స్క్రీన్ ప‌గులుతుంద‌న్న భ‌యం అక్క‌ర‌లేదు.. రబ్బరులా సాగే డిస్లేలు వ‌చ్చేశాయ్

First Published | Nov 21, 2024, 10:34 AM IST

LG stretchable display:  ఎల్‌జీ కంపెనీ 50% వరకు సాగే కొత్త డిస్‌ప్లే ప్యానెల్‌ను విడుదల చేసింది. మడతపెట్టడం, వంచడం, సాగదీయడం వంటి ఎన్నో రకాలుగా ఉపయోగించగల ఈ డిస్‌ప్లే.. ఎన్నో రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.

LG stretchable display

కాలంతో పరుగులు పెడుతూ టెక్నాలజీ కూడా అతి వేగంగా అభివృద్ధి చెందుతోంది. మరీ ముఖ్యంగా స్క్రీన్, డిస్‌ప్లే టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అయినప్పటికీ అవి పగిలిపోతాయనే భయం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ భయం లేకుండా చేస్తోంది ప్రముఖ టెక్ కంపెనీ ఎల్జీ.  2024లోనే ఎన్నో కొత్త డిస్‌ప్లేలు వచ్చాయి. చుట్టేయగల డిస్‌ప్లే, మడతపెట్టే డిస్‌ప్లే, గాజులా పారదర్శకంగా కనిపించే డిస్‌ప్లే ఇలా కొత్త ఆవిష్కరణలు వచ్చాయి. ఇప్పుడు రబ్బరులా సాగే డిస్‌ప్లే కూడా వచ్చేసింది !

డిస్‌ప్లే

ఇప్పుడు, దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ కంపెనీ సాగే కొత్త డిస్‌ప్లే ప్యానెల్‌ను విడుదల చేసింది. ఈ డిస్‌ప్లే 50% వరకు సాగుతుందని ఎల్‌జీ చెబుతోంది. మడతపెట్టవచ్చు, వంచవచ్చు, సాగదీయవచ్చు. డిస్‌ప్లే సాగుతుంది కూడా. ఇవన్నీ చేసినా డిస్‌ప్లే కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిజంగా ఇది సూపర్ కదా.. !


ఎల్‌జీ సాగే డిస్‌ప్లే

ఈ డిస్‌ప్లే వాడకం చాలా విస్తృతమైనది. ధరించగల గాడ్జెట్‌లలో వాడవచ్చు. శరీరానికి తగ్గట్టుగా దుస్తులలో అమర్చవచ్చు. వాహనాల్లో కూడా వాడవచ్చు. కారు డాష్‌బోర్డ్ డిజైన్‌లో విప్లవాత్మక మార్పులకు సూచనగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ డిస్ప్లే చాలా తేలీకైనది. ఎక్కువ బరువు కూడా ఉండదు. 

stretchable display

సియోల్‌లోని ఎల్‌జీ సైన్స్ పార్క్‌లో విడుదలైన 12 అంగుళాల డిస్‌ప్లే ప్యానెల్‌ను 18 అంగుళాల వరకు సాగదీయవచ్చు. కాంటాక్ట్ లెన్స్‌లలో ఉండే సిలికాన్‌ను, కొత్త వైరింగ్ డిజైన్‌ను వీటి తయారీ కోసం ఎల్‌జీ వాడుతోంది. 

ఎల్‌జీ సాగే డిస్‌ప్లే

మైక్రో ఎల్‌ఈడీ లైట్ టెక్నాలజీని ఎల్‌జీ వాడుతోంది. 40 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉండే ఈ డిస్‌ప్లే 10,000 సార్లు సాగదీసినా మన్నికగా ఉంటుంది. తక్కువ, ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది. 

సాగే డిస్‌ప్లేపై ఎల్‌జీ చాలా ఏళ్లుగా పరిశోధన చేస్తోంది. 2022లో మొదటిసారి సమాచారం విడుదల చేసింది. ఇప్పుడు 20% నుంచి 50% సాగేలా అభివృద్ధి చేసింది. భవిష్యత్తులో దీంతో మరిన్ని సంచలనాలు చేయడానికి సిద్ధమవుతోంది ఎల్జీ కంపెనీ. 

ఎల్‌జీ సాగే డిస్‌ప్లే

ఇదే సమయంలో రియల్ టైమ్ అప్‌డేట్‌లను అందించే అగ్నిమాపక సిబ్బంది యూనిఫారమ్‌ల కోసం ధరించగలిగే డిస్‌ప్లేలతో సహా సంభావ్య అప్లికేషన్‌లను ఎల్జీ డిస్‌ప్లే ప్రదర్శించింది. వక్ర ఉపరితలాలకు అనుగుణంగా ఉండే ఆటోమోటివ్ ప్యానెల్‌లను అందిస్తుంది. స్క్రీన్ తేలికపాటి డిజైన్ స్మార్ట్ దుస్తులు, వస్త్రాలలో కూడా వాడుకునే అవకాశాలను సూచిస్తుంది. 

సాగదీయగల స్క్రీన్ ప్రోటోటైప్ దశలోనే ఉన్నప్పటికీ, LG డిస్‌ప్లే సాధన ప్రదర్శన సాంకేతికత  సరిహద్దులను పునర్నిర్వచించటానికి దాని నిబద్ధతను నొక్కి చెబుతుంది. స్క్రీన్ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఇది మార్గదర్శిగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. 
 

Latest Videos

click me!