ITR filing FY 2021-22:ఈ 5 వర్గాల పన్ను చెల్లింపుదారులకు గడువు పెంపు.. వివరాలు ఇవే

Ashok Kumar   | Asianet News
Published : Jan 12, 2022, 01:04 PM IST

 దేశంలో పెరుగుతున్న కొరోనావైరస్ కేసులు అలాగే  ఆన్యువల్ ఇయర్(AY)2021-22కి ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు వివిధ రకాల అంతరాయల నివేదికల దృష్ట్యా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) మంగళవారం ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి వివిధ గడువులను పొడిగించింది . 

PREV
16
ITR filing FY 2021-22:ఈ 5 వర్గాల పన్ను చెల్లింపుదారులకు గడువు పెంపు.. వివరాలు ఇవే

“కోవిడ్-19 కారణంగా పన్ను చెల్లింపుదారులు, ఇతర స్టేక్ హోల్డర్స్ నివేదించిన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని  అలాగే ఆదాయపు పన్ను చట్టం, 1961 (చట్టం) నిబంధనల ప్రకారం ఆడిట్ వివిధ నివేదికలను ఎలక్ట్రానిక్ ఫైల్ చేయడంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) 2021-22 అసెస్‌మెంట్ ఇయర్ కోసం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అండ్ వివిధ ఆడిట్ రిపోర్టుల దాఖలు గడువు తేదీలను మరింత పొడిగించాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

26

ఆదాయపు పన్ను రిటర్న్‌ను ధాఖలు చేయాల్సిన విషయంలో పన్ను చెల్లింపుదారులు ఈ నిర్ణయం నుండి ప్రయోజనం పొందుతారు. ఆడిట్ అవసరమైన పన్ను చెల్లింపుదారుల కోసం ఆడిట్ నివేదికను అందించడానికి గడువు తేదీ జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 వరకు పొడిగించబడింది. ఆడిట్ అవసరమైన పన్ను చెల్లింపుదారుల కోసం AY 2021-22 కోసం ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి గడువు తేదీ ఫిబ్రవరి 15 నుండి మార్చి 15 వరకు పొడిగించబడింది. 

36

ఏ‌వై2021-22 కోసం పొడిగించబడిన వివిధ ఐ‌టి‌ఆర్ గడువుల జాబితా..

1) సెక్షన్ 139లోని వివరణ 2లోని క్లాజ్ (a) నుండి సబ్ సెక్షన్ (1) వరకు సూచించిన విషయంలో గత సంవత్సరం 2020-21 చట్టంలోని ఏదైనా నిబంధన ప్రకారం ఆడిట్ నివేదికను సమర్పించాల్సిన గడువు తేదీని 15  ఫిబ్రవరి 2022 వరకు పొడిగించబడింది.

2) సెక్షన్ 139లోని సెక్షన్ (1)కి వివరణ 2లోని క్లాజ్ (aa)లో సూచించిన అసెస్సీల విషయంలో గత సంవత్సరం 2020-21 చట్టంలోని ఏదైనా నిబంధన ప్రకారం ఆడిట్ నివేదికను సమర్పించాల్సిన గడువు తేదీ 15 ఫిబ్రవరి 2022 వరకు పొడిగించబడింది.

3) అంతకుముందు సంవత్సరానికి 2020-21 చట్టంలోని సెక్షన్ 92E కింద అంతర్జాతీయ లావాదేవీ లేదా నిర్దేశిత దేశీయ లావాదేవీలలోకి ప్రవేశించే వ్యక్తులు అకౌంటెంట్ నుండి నివేదికను సమర్పించాల్సిన గడువు తేదీ 15 ఫిబ్రవరి 2022 వరకు పొడిగించబడింది.

46

4) చట్టంలోని సెక్షన్ 139లోని సబ్-సెక్షన్ (1) ప్రకారం, అసెస్‌మెంట్ ఇయర్ 2021-22 కోసం ఆదాయాన్ని రిటర్న్ పొండానికి గడువు తేదీని 15 మార్చి 2022 వరకు పొడిగించారు.

5) చట్టంలోని సెక్షన్ 139లోని సబ్-సెక్షన్ (1) కింద అసెస్‌మెంట్ ఇయర్ 2021-22 కోసం ఆదాయాన్ని రిటర్న్ పొండానికి  గడువు తేదీని 15 మార్చి 2022 వరకు పొడిగించారు.

వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కోసం ఆడిట్ అవసరం లేని చోట ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి గడువు తేదీ డిసెంబర్ 31.
 

56

ఐ‌టి‌ఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపు  ప్రయోజనాలను ఎవరు పొందుతారు?

31 అక్టోబర్ 2021 లేదా 31 నవంబర్ 2021లోపు ఆదాయపు రిటర్న్‌ను దాఖలు చేయాల్సిన పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ గడువు తేదీని పొడిగించింది.

 “క్రింది పన్ను చెల్లింపుదారులు ఈ వర్గంలోకి వస్తారు: కార్పొరేట్-అసెస్సీ; నాన్-కార్పొరేట్ అసెస్సీ; ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం ఉన్న సంస్థ  పార్ట్నర్  అండ్ సెక్షన్ 5A నిబంధనలు వర్తింపజేస్తే  పార్ట్నర్  యొక్క జీవిత భాగస్వామి;  అంతర్జాతీయ లేదా నిర్దేశిత దేశీయ లావాదేవీ(ల)కు సంబంధించిన సెక్షన్ 92E కింద నివేదికను సమర్పించాల్సిన అవసరం ఉన్న అసెస్సీ," అని టాక్స్‌మన్, డి‌జి‌ఎం, రాహుల్ సింగ్ వివరించారు. పైన పేర్కొన్న వర్గాలలో దేనికీ చెందని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుడు ఎటువంటి పొడిగింపు ప్రయోజనాన్ని పొందలేరు .
 

66

“పన్ను లయబుల్ రూ. 1 లక్ష దాటితే సెక్షన్ 234A కింద వసూలు చేయదగిన వడ్డీ నుండి ఎలాంటి ఉపశమనం లభించలేదని గమనించాలి. అందువల్ల, పన్ను చెల్లింపుదారుడు సెల్ఫ్-అసెస్‌మెంట్ ట్యాక్స్ బాధ్యత రూ. 1 లక్ష దాటితే, అతను అసలు గడువు తేదీ ముగిసినప్పటి నుండి సెక్షన్ 234A కింద వడ్డీని చెల్లించవలసి ఉంటుంది.

click me!

Recommended Stories