Business Ideas: ఎకరం పొలం ఉంటే చాలు మీరు నమ్మినా నమ్మకపోయినా పర్లేదు..ఏడాదిలో రూ. 10 లక్షలు మీ సొంతం..

First Published | Jun 5, 2023, 5:35 PM IST

వ్యవసాయం దండగ అని చాలామంది అంటారు. నిజానికి వ్యవసాయం సరిగ్గా  నిర్వహణ చేసుకుంటే అది ఒక పండగ అని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఒకటి లేదా రెండు ఎకరాల విస్తీర్ణం ఉంటే చాలు లక్షల రూపాయలు సంపాదించి పెడితే పంటలు అనేకం ఉన్నాయి .అలాంటి ఓ పంట గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

గోరుచిక్కుడుకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని  కూర చేసుకుని తింటూ ఉంటారు. గోరుచిక్కుడు లో ఎన్నో పోషకాలు ఉన్నాయి.  ముఖ్యంగా గోరుచిక్కుడుకాయలోని విటమిన్ బి కాంప్లెక్స్ మన శరీరానికి ఎంతో అత్యవసరం. అలాగే ఇందులో ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే గోరుచిక్కుడు లోని ఫైబర్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడే వారికి గోరుచిక్కుడుకాయ ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. 
 

అయితే గోరుచిక్కుడుకాయ పంటను ఒక వాణిజ్య పంటగా కూడా చెప్పవచ్చు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. మనం ఇంతకాలం గోరుచిక్కుడుకాయను కేవలం ఒక కూరగాయగా మాత్రమే భావించాం.  నిజానికి గోరుచిక్కుడుకాయ అనేది ఒక వాణిజ్య పంట.  గోరుచిక్కుడుకాయ గింజలకు  చాలా డిమాండ్ ఉంటుంది. గోరుచిక్కుడు గింజల నుంచి తీసిన జిగురుకు చాలా డిమాండ్ ఉంది. అంతర్జాతీయంగా కూడా గోరుచిక్కుడు గింజల జిగురుకు అత్యంత విలువ ఉంది.  మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న అనేక విలువైన వస్తువుల్లో గోరుచిక్కుడు జిగురు కూడా ఒకటి. 
 


గోరుచిక్కుడు జిగురును  పారిశ్రామికంగా అనేక ఉత్పత్తుల్లో వాడుతారు. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీస్ లో గోరుచిక్కుడు జిగురుకు చాలా డిమాండ్ ఉంది. ఐస్ క్రీమ్ తయారీలో కూడా గోరుచిక్కుడు జిగురును వాడుతుంటారు. అలాగే బేకరీ పరిశ్రమలో కూడా గోరుచిక్కుడు జిగురుకు చాలా డిమాండ్ ఉంది.  ఇక అమెరికాలోని అనేక పరిశ్రమల్లో గోరుచిక్కుడు దిగులు ఉపయోగిస్తున్నారు.  ఈ నేపథ్యంలో గోరుచిక్కుడు గింజలకు వాణిజ్యంగా చాలా డిమాండ్ ఉంది. 
 

మీరు  గోరుచిక్కుడు పంటను వేసినట్లయితే ముందుగా గోరుచిక్కుడు గింజలకు మార్కెట్ వెతుక్కోవడం మంచిది.  గోరుచిక్కుడు గింజలను ఎలా ఉత్పత్తి చేయాలో ఉద్యాన శాఖ నుంచి సలహాలు పొందితే మంచిది.  తెలంగాణ రాష్ట్రంలో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిపుణుల వద్ద నుంచి సలహాలను పొందవచ్చు. 

గోరుచిక్కుడు గింజలను ఉత్పత్తి చేసి వాటిని మార్కెట్లో విక్రయించడం అనేది ఒక వినూత్నమైన పద్ధతి అనే చెప్పాలి. ఇప్పటివరకు  కేవలం గోరుచిక్కుడుకాయను ఒక కూరగాయగా మాత్రమే వాడుతూ వచ్చాము. ఇకనుంచి గోరుచిక్కుడును వాణిజ్య పంటగా ఏ విధంగా సాగు చేయాలో మెలకువలు తెలుసుకుంటే మంచిది. వీలైతే గోరుచిక్కుడు గింజలనుంచి జిగురును ఎలా ప్రాసెస్ చేయాలో కూడా తెలుసుకుంటే మంచిది.  తద్వారా మీరు ఒక అనుబంధ పరిశ్రమను ప్రారంభించి గోరుచిక్కుడు గింజల నుంచి జిగురును తయారు చేసి,  నేరుగా పరిశ్రమలకు విక్రయించవచ్చు. తద్వారా ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది. 

ఇక గోరుచిక్కుడు పంట విషయానికి వస్తే నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సైతం గోరుచిక్కుడు ఏపుగా ఎదుగుతుంది.  దీనికి ఎరువుల వాడకం కూడా చాలా తక్కువ.  నత్రజని స్వయంగా తయారు చేసుకునే మొక్క ఇది. అంతేకాదు గోరుచిక్కుడు అంతర పంటగా వేసుకున్నట్లయితే నేల సారం కూడా పెరుగుతుంది. 

Latest Videos

click me!